WhatsApp Digilocker: వాట్సాప్‌లో హయ్‌.. అని పంపండి.. డిజీలాకర్‌ సేవలు పొందండి..!

WhatsApp Digilocker: ఇప్పుడు మీరు మీ అన్ని ముఖ్యమైన పత్రాలను మీతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ లేదా ఆధార్ కార్డ్ వంటి మీ..

WhatsApp Digilocker: వాట్సాప్‌లో హయ్‌.. అని పంపండి.. డిజీలాకర్‌ సేవలు పొందండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 08, 2022 | 4:36 PM

WhatsApp Digilocker: ఇప్పుడు మీరు మీ అన్ని ముఖ్యమైన పత్రాలను మీతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ లేదా ఆధార్ కార్డ్ వంటి మీ ముఖ్యమైన పత్రాలను డిజిలాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు డిజిలాకర్ సేవలను వాట్సాప్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ అన్ని సర్టిఫికేట్లను భద్రతంగా ఉంచుకోవచ్చు. ఈ డిజిలాకర్‌ను వాట్సాప్‌ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు.

వాట్సాప్‌లో డిజిలాకర్‌ని ఎలా ఉపయోగించాలి?

వాట్సాప్‌లో డిజిలాకర్‌ని ఉపయోగించడానికి, ముందుగా మీరు myGov వాట్సాప్ నంబర్- 9013151515ని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం నమస్తే, హాయ్ అని పంపి కూడా ఈ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం ఆధార్‌, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్ష్‌ వంటివి తప్పనిసరిగ్గా వెంట ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ మర్చిపోయి ఇంటి వద్దనే ఉంచితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంటి. అలాంటి సమయంలో ఇబ్బందులు పడకుండా కేంద్రం ఈ డిజీ లాకర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలోనే వర్చువల్‌ లాకర్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డిజీలాక్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇందలో మీ పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీకార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌ పోర్టుతో పాటు మీ సర్టిఫికేట్లు ఇలా ఎన్నో రకాల సర్టిఫికేట్లను అందులోనే భద్రంగా దాచుకోవచ్చు. ఈ విధంగానే కాకుండా మొబైల్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని కూడా సర్టిఫికేట్లను భద్రపర్చుకోవచ్చు. మీ డాక్యుమెంట్లను దాచుకోవాలంటే ముందుగా డిజీలాకర్‌లో మీ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

అత్యవసర సమయాల్లో.. అయితే ఈ యాప్‌లో దాచుకున్న పత్రాలన్ని అత్యవసర సమయాల్లో ఉపయోగ పడతాయి. రైలులో ప్రయాణించేటప్పుడు లేదా ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాలను తనిఖీ చేసిన సమయంలో మీ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటివి ఈ డీజీలాకర్‌లో చూపించుకోవచ్చు. దీని వల్ల మీకు సమయానికి ఉపయోగడపతాయి. ఎవరైన ఈ వాహనం తనిఖీ చేసిన సమయంలో గానీ, ఎక్కడైన ఒరిజినల్‌ సర్టిఫికేట్లు చూపించాలని అడిగిన సమయంలో గానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ లేని వారు డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

డిజిలాకర్‌ను జూలై 2015లో భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రచారంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. డిజిలాకర్‌లో దేశంలోని సాధారణ పౌరులు ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్‌తో సహా ఏదైనా ప్రభుత్వ పత్రాన్ని భద్రత పర్చుకోవచ్చు. పత్రాలను డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో కూడా సేవ్ చేయవచ్చు. ఖాతా తెరవడానికి, ఒక వ్యక్తి ఆధార్ కార్డును కలిగి ఉండటం అవసరం. డిజిలాకర్‌లో ఇప్పటివరకు 100 మిలియన్ల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి