Sri lanka Economic Crisis: టెంట్లు తగులబెట్టింది ఈ ఖైదీలే.. చితకబాదిన నిరసనకారులు..
. గాలే ఫేస్ వద్ద మొదట దాడి చేసి టెంట్లు తగులబెట్టింది ఈ ఖైదీలేనని నిర్ధారించారు. తమని జైలు నుంచి అధికారులే విడుదల చేసి పంపారని ఖైదీల ప్రకటించారు. నేరస్తుల వీడియో బైట్‌కు రావడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగింది.
శ్రీ లంకా(Sri lanka) దహనానికి రాజపక్స కారణమా? కరుడుగట్టిన ఖైదీలను జైలు నుంచి తీసుకురావడం వల్లే ఈ విధ్వంసమా? లంక విధ్వంసానికి వాళ్లే కారణమా..? అంటే అదే నిజమంటున్నారు లంక ప్రజలు. తమపై దాడి చేయించడానికి మహింద్ర రాజపక్సే జైలు నుంచి కరడుగట్టిన నేరస్తులని బైటకు తీసుకొచ్చి తమపై ఉసిగొల్పారంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదిమంది ఖైదీలని పట్టుకుని జనం చితకబాదారు. గాలే ఫేస్ వద్ద మొదట దాడి చేసి టెంట్లు తగులబెట్టింది ఈ ఖైదీలేనని నిర్ధారించారు. తమని జైలు నుంచి అధికారులే విడుదల చేసి పంపారని ఖైదీల ప్రకటించారు. నేరస్తుల వీడియో బైట్‌కు రావడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనం రాత్రి రాజపక్స ఇంటికి నిప్పు పెట్టారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్సని వేరే దేశానికి తరలించే అవకాశం ఉంది. నిన్న దేశం వదిలిపోయారు యోషితా రాజపక్ష.. జనంపై రాజపక్స మద్దతుదారులు దాడులు చేస్తున్నారు.
ప్రధాని మహింద రాజపక్స రాజీనామా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేశారు. రాజధానిలో భారీగా సైన్యం మోహరించారు. కురునాగళలోని మహేంద్ర రాజపక్స్ ఇంటిని తగులబెట్టారు ఆందోళనకారులు. మంత్రి కంచన విజే శేఖరా ఇంటినీ తగులబెట్టారు. ఈ విధ్వంసంలో ఇప్పటి వరకూ ఓ ఎంపీ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అంతర్జాతీయ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: Cyclone Asani Live Updates: ఉత్తరాంధ్రలో అసని అలజడి.. ఉప్పాడ సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..
Hyderabad: ప్రేమ జంట రిజిస్ట్రేషన్ మ్యారేజ్.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..