Sri Lanka: ద్వీపదేశంలో ముదురుతున్న సంక్షోభం.. ప్రతిపక్ష నేతపై ఆందోళనకారుల దాడి
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక(Sri Lanka)లో పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ మద్దతు దారుల మధ్య ఘర్షషణలు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారుల....
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక(Sri Lanka)లో పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. ఆందోళనకారులు, ప్రభుత్వ మద్దతు దారుల మధ్య ఘర్షషణలు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారుల డిమాండ్లకు తలొగ్గి.. ప్రధాని పదవికి రాజపక్సే రాజీనామా చేయగా ఎంపీ అమరకీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలతో పరిస్థితులు చేయి జారాయి. మరోవైపు.. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపైనా ఆందోళనకారులు దాడి చేశారు. గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్నవారికి మద్దతి తెలిపేందుకు వచ్చిన ప్రేమదాసపై రాళ్లు, కర్రలతో దాడి చేసి తరిమికొట్టారు. చాలా దూరం పరిగెత్తి కారెక్కి ప్రేమదాస వెళ్లిపోయారు. గొటబయ రాజపక్సేని గద్దె దించడంలో విఫలమయ్యారని, ఇన్ని రోజుల నుంచి తాము ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంకలో జరగుతున్న హింసను తట్టుకోలేక బౌద్ధ గురువు ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మరోవైపు.. ప్రభుత్వ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో 174 మంది గాయపడ్డారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. రాజధాని కొలంబోలో సైనిక బలగాలను మోహరించాయి. మహీంద రాజీనామాతో కేబినెట్ కూడా రద్దయింది. ఆందోళనకారులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలపై మహీంద మద్దతుదారులు దాడి చేశారు. మైనాగోగామా టెంట్లను కూల్చివేశారు. నిరసనకారులపై దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో గాయపడ్డ 174 మందిలో 78 మంది ఆసుపత్రిలో చేరారు.
శ్రీలంకలో నెలకొన్న ఘర్షణలను దేశాధ్యక్షుడు గొటబాయ ఖండించారు. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలు హింసతో పరిష్కారం కావని.. శాంతంగా ఉండాలని కోరారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కలిసికట్టుగా కృషిచేద్దాం అని ఆయన ట్వీట్ చేశారు. గత శుక్రవారం కేబినెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన గొటబాయ దేశంలో అత్యయిక స్థితి విధించారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Ram Charan: సముద్రతీరాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్