Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malala: వారి హక్కులు, స్వేచ్ఛకు సంకెళ్లు వేయొద్దు.. మలాలా ఆవేదన

తాలిబన్ల పాలన, మహిళలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘన్ మహిళలపై అక్కడి ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా బుర్ఖా ధరించాలని....

Malala: వారి హక్కులు, స్వేచ్ఛకు సంకెళ్లు వేయొద్దు.. మలాలా ఆవేదన
Malala
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 10, 2022 | 7:07 AM

తాలిబన్ల పాలన, మహిళలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆఫ్ఘన్ మహిళలపై అక్కడి ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా బుర్ఖా ధరించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్ స్పందించారు. తాలిబన్‌ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులను స్కూల్ కు పంపించంచకుండా ఉండడం, మహిళలను ఉద్యోగాలకు దూరం చేయడం, మగ వాళ్ల తోడు లేకుండా ప్రయాణాలు చేయడంపై నిషేధం విధించడం వంటి కారణాలతో మహిళల హక్కులు, స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారని విమర్శించారు. ఆ దేశంలోని బాలికలు, మహిళలను సమాజం నుంచి తుడిచిపెట్టేయాలని వారు భావిస్తున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల తాలిబన్లు చూపుతున్న ఆంక్షలను నిర్లక్ష్యం చేయవద్దని మలాలా కోరారు. ఇప్పటికీ మహిళలు తమ హక్కులు, గౌరవం కోసం పోరాడటానికి వీధుల్లోకి వస్తున్నారని.. మనమందరం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

అఫ్గానిస్థాన్ ఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు పరిపాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే తమ దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలను విధించారు. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాదు డ్రైవింగ్ టీచర్లకు కూడా ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు ప్రకటించింది.

తాలిబన్లు అఫ్గానిస్థాన్ ను స్వాధీనం చేసుకోవడానికి ముందు కాబూల్‌తో సహా దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మహిళలు డ్రైవింగ్ చేసేవారు. అయితే ఇప్పుడు తాలిబన్లు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌లను నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Viral Video: తెల్లపులి, పసుపు పులి మధ్య భీకర పోరు.. మామూలుగా లేదు ఫైట్‌..!

Heart Health: మీ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుందా.. కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!