కడుపులోకి దూసుకుపోయిన రాకెట్.. పాప్ సింగర్ మృతి
వేదిక మీద మ్యూజిక్ షో నిర్వహిస్తుండగా ఓ పాప్ గాయని సజీవ దహనమైంది. ఆదివారం జరిగిన ఈ విషాదకర సంఘటన కలకలం రేపింది. డాన్సర్ జోయానా సెయిన్స్ అనే ప్రముఖ స్పానిష్ పాప్‌స్టార్ సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా టీమ్‌తో లైవ్ షో చేస్తుండగా ఒక్కసారిగ ప్రమాదం సంభవించింది. వేదికపై జొయానా సెయిన్స్ బృందం షో చేస్తుండగా అక్కడున్న వారు బాణాసంచా కాల్చారు. అయితే ఉన్నపాటుగా ఒక్కసారి బాణాసంచా రాకెట్లు వేదికపైకి దూసుకెళ్లాయి. దీంతో వేదిక అగ్నిప్రమాదానికి గురైంది. […]
వేదిక మీద మ్యూజిక్ షో నిర్వహిస్తుండగా ఓ పాప్ గాయని సజీవ దహనమైంది. ఆదివారం జరిగిన ఈ విషాదకర సంఘటన కలకలం రేపింది. డాన్సర్ జోయానా సెయిన్స్ అనే ప్రముఖ స్పానిష్ పాప్‌స్టార్ సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా టీమ్‌తో లైవ్ షో చేస్తుండగా ఒక్కసారిగ ప్రమాదం సంభవించింది. వేదికపై జొయానా సెయిన్స్ బృందం షో చేస్తుండగా అక్కడున్న వారు బాణాసంచా కాల్చారు. అయితే ఉన్నపాటుగా ఒక్కసారి బాణాసంచా రాకెట్లు వేదికపైకి దూసుకెళ్లాయి. దీంతో వేదిక అగ్నిప్రమాదానికి గురైంది. నాలుగు రోజుల స్టేజ్ షోలో భాగాంగా చివరి రోజు కావడంతో జనం అధికంగా వచ్చారు. దాదాపు వెయ్యి మంది వరకు అక్కడ ఉన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
బాణాసంచా రాకెట్ల జొయానా సెయిన్స్ కడుపులోకి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే హాస్పిటల్‌కి తరలించే లోపే జొయానా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.