AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాన్ అదుర్స్.. మురుగు నుంచి మంచి నీరుగా మార్చే ప్రయోగం.. నీటి కష్టాలకు చెక్..

ప్రజలందరికీ తాగునీటిని అందించే దిశగా సింగపూర్ ప్రభుత్వం బృహుత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అధునాతన

ప్లాన్ అదుర్స్.. మురుగు నుంచి మంచి నీరుగా మార్చే ప్రయోగం.. నీటి కష్టాలకు చెక్..
Singapore
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2021 | 4:11 PM

Share

ప్రజలందరికీ తాగునీటిని అందించే దిశగా సింగపూర్ ప్రభుత్వం బృహుత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అధునాతన వ్యవస్థతో కూడిన ఓ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి.. వాటిని మంచినీరుగా మార్చి ప్రజలకు అందించాలన్న ధ్యేయంతోనే సింగపూర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. సింగపూర్‌లో సహజనీటి వనరులు లభ్యత తక్కువ. ప్రతీసారి నీటి సరఫరా కోసం పొరుగున ఉన్న మలేషియా దేశంపై ఆధారపడుతూ ఉంటుంది.

ఈ నేపధ్యంలోనే స్వయం సమృద్ధిని పెంపొందించేందుకు ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. భారీ పంపులు, టన్నెల్స్‌తో కూడిన హైటెక్ ప్లాంట్ల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ ప్లాంట్‌ భూగర్భంలో అమర్చిన భారీ పంపులు మురుగునీటిని శుద్ధి చేస్తాయి. అలాగే ఈ ప్లాంట్ ద్వారా సముద్రపు కాలుష్యం కూడా తగ్గుతుందని ఆ దేశ వాటర్ ఏజెన్సీ తెలిపింది. ఇలా మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా రాబోయే కాలంలో నీటి కొరత తగ్గుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు. 2060వ సంవత్సరానికి సుమారు 55 శాతం మేరకు నీటి కొరతను అధిగమించవచ్చునని ఆ దేశ వాటర్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ప్లాంట్ల నుంచి శుద్ధి చేసిన జలాలను పారిశ్రామిక అవసరాలకు వాడటంతో పాటు నగరంలోని రిజర్వాయర్ల ద్వారా తాగునీటి సరఫరా కూడా చేస్తామని అధికారులు అన్నారు.

“సింగపూర్‌లో సహజ వనరులు లేవు. అందుకే మేము ఎల్లప్పుడూ నీటి వనరులను అన్వేషించడమే కాకుండా నీటి సరఫరాను విస్తరించడానికి గల మార్గాలను వెతుకుతాం” అని పబ్లిక్ యుటిలిటీస్ బోర్డులోని నీటి పునరుద్ధరణ విభాగం చీఫ్ ఇంజినీర్ స్పష్టం చేశారు.

భూగర్భ ప్లాంట్ వివరాలు.. మురుగునీటిని శుద్ధి చేసే ఈ ప్లాంట్‌ను సింగపూర్ ప్రభుత్వం భూగర్భంలో నిర్మించింది. దాదాపు 25 అంతస్థుల మేర లోతు ఉండే ఈ ప్లాంట్.. టన్నల్స్ సహాయంతో నగరంలోని మురుగు కాలువలతో అనుసంధానమై ఉంటుంది. సుమారు 30 మైళ్ల టన్నల్స్ గుండా మురుగునీరు ప్రవహిస్తుంది. ఈ ప్లాంట్‌లోని స్టీల్ పైపులు, ట్యూబ్‌లు, ట్యాంకులు, ఫిల్టరేషన్ సిస్టమ్స్, ఇతర యంత్రాలు ప్రతిరోజూ 900 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తుంటాయి. అంతేకాకుండా స్వచ్చమైన గాలి కోసం ఓ భవనం నిండా వెంటిలేటర్లు అమర్చబడి ఉంటాయి. కాగా, ఈ నీటి శుద్దీకరణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సుమారు 7.4 బిలియన్ డాలర్లను సింగపూర్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

Also Read: Hockey Player Rajini: ఒలింపిక్‌ హాకీ ప్లేయర్‌ రజినీపై వరాల జల్లు కురిపించిన సీఎం జగన్‌.. రూ. 25 లక్షలు, ఉద్యోగంతో పాటు..

Kasturi: మూడేళ్లు ప్రాణం కోసం పోరాటం.. ఆ సమయంలో ఎన్నో నేర్చుకున్నాను.. నటి కస్తూరి ఎమోషనల్ కామెంట్స్..