నిద్ర పట్టకపోవడానికి గల కారణాలపై కొత్త కోణం

Vijay K

Vijay K |

Updated on: Mar 21, 2019 | 2:14 PM

చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఈ నిద్రలేమి రోగం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బాధపెడుతుంటుంది. అయితే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని గుర్తించారు. మనషుల వయసు పెరగడానికి సంబంధించిన ముఖ్యమైన కనాలు మెడులో ఉంటాయిని, వాటి చేతుల్లో నిద్రను నియంత్రించే శక్తి ఉంటుందని తెలిపారు. అంతర్గత ఒత్తిడికి గురైతే అది వయసు పెరగడానికి కారణమౌతుంది. అంతేగాక అది నిద్రపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈగ మెదడు కణాలు, మానవ మెడుడు కణాలకు దగ్గర […]

నిద్ర పట్టకపోవడానికి గల కారణాలపై కొత్త కోణం

చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఈ నిద్రలేమి రోగం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బాధపెడుతుంటుంది. అయితే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని గుర్తించారు. మనషుల వయసు పెరగడానికి సంబంధించిన ముఖ్యమైన కనాలు మెడులో ఉంటాయిని, వాటి చేతుల్లో నిద్రను నియంత్రించే శక్తి ఉంటుందని తెలిపారు.

అంతర్గత ఒత్తిడికి గురైతే అది వయసు పెరగడానికి కారణమౌతుంది. అంతేగాక అది నిద్రపై పెద్ద ప్రభావం చూపుతుంది. ఈగ మెదడు కణాలు, మానవ మెడుడు కణాలకు దగ్గర పోలిక ఉంటుంది. దీంతో ఈగ మెదడు కణాలపై పరిశోధన చేయడం జరిగింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

మనం ఎంతసేపు నిద్రపోతున్నాము అనే అంశంపై ఆధారపడి మన వయసు ఎంత తొందరగా ముసలితనం వైపు వెళుతుందనేది తెలుస్తుంది. అంతే కాదు మనం ఎంత తొందరగా రోగాల బారిన పడతామనేది కూడా ఆధారపడి ఉంటుంది. నిద్రలేమి వల్ల నిద్ర మాత్రల వాడకం బాగా పెరిగింది. ఈ నిద్ర మాత్రల వాడకం వల్ల అయోమయ పరిస్థితిలోకి నెట్టబడటం జరుగుతుంది. మొదడు ఆలోచన మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేసేందుకు తాజా పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu