Makkah: కాబా అరుదైన చిత్రాలను విడుదల చేసిన సౌదీ అరేబియా.. 7 గంటలపాటు శ్రమించి..

Maqam Ibrahim: సౌదీ అరేబియా.. మక్కాలోని రాజ మసీదులో ఉన్న మక్కా-ఎ-ఇబ్రహీంకి చెందిన కొన్ని అరుదైన చిత్రాలను సౌదీ అరేబియా

1/6
Macca
Maqam Ibrahim: సౌదీ అరేబియా.. మక్కాలోని రాజ మసీదులో ఉన్న మక్కా-ఎ-ఇబ్రహీంకి చెందిన కొన్ని అరుదైన చిత్రాలను సౌదీ అరేబియా విడుదల చేసింది. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా చిత్రాల కోసం జనరల్ ప్రెసిడెన్సీ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాలను తీసినట్లు తెలిపింది.
2/6
Makkah
ఇస్లాం ఆచారం ప్రకారం.. మక్కా-ఏ-ఇబ్రహీం పాదముద్రలు.. కాబా నిర్మాణంలో పనిచేస్తుండగా.. ఈ పాద ముద్రలు పడ్డాయి. ప్రవక్త పాదముద్రలను కాపాడటానికి ఈ రాయిని బంగారం, వెండి, గాజుతో అలంకరించారు.
3/6
Saudi Arabia
హజ్ యాత్రలో ముస్లింలు ఈ పాదముద్ర ఉన్న రాయిని దర్శించుకుంటే.. స్వర్గ ప్రాప్తి అవుతుందని నమ్మకం. ఇది స్వర్గ రాయి అని పేర్కొంటుంటారు. అందుకే అందరూ కాబాలో ఉన్న ప్రవక్త పాదముద్రలను దర్శించుకుంటారు.
4/6
Makkah, Madina
ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. మక్కా-ఏ-ఇబ్రహీం చదరపు ఆకారం మధ్యలో ఇబ్రహీం ప్రవక్త పాదముద్రలు ఉంటాయి. మక్కా ఏ ఇబ్రహీం రంగు తెలుపు, నలుపు, పసుపు (నీడ) మధ్య ఉంటుంది. దాని వెడల్పు, పొడవు, ఎత్తు 50 సెం.మీ. ఉంటుంది.
5/6
Maqam E Ibrahim
ఈ మేరకు మే 4 న సౌదీ అరేబియా అధికారులు కాబా, నల్ల రాళ్ళపై ఉన్న ఈ ముద్రల హై-రిజల్యూషన్ చిత్రాలను విడుదల చేశారు. సౌదీ మక్కాలోని కాబాలో ఉన్న ఈ నల్ల రాయి అరుదైన చిత్రాలను సౌదీ అరేబియా ప్రభుత్వం విడుదల చేసింది.
6/6
Makkah Grand Mosque
మసీదులో ఈ చిత్రాలను తీసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో 1000 కి పైగా చిత్రాలు తీశారు. 49,000 మెగాపిక్సెల్స్ వరకు ఉన్న కెమెరాలతో వీటిని తీసినట్లు సౌదీ సమాచార మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.