Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Powered Scooters: ఉప్పుతో నడిచే స్కూటర్లు వచ్చేశాయి.. ధర తక్కువ మన్నిక ఎక్కువ.. మన దేశంలో ఎప్పుడంటే..

ఇప్పుడు స్కూటర్లు పెట్రోల్-డీజిల్‌కు బదులుగా ఉప్పుతో నడుస్తాయి. అవును ఈ దిశలో మనదేశంలో ఆలోచనలు చేస్తుంటే.. పొరుగు దేశమైన డ్రాగన్ కంత్రీ కంట్రీలో లో సముద్రం ఉప్పుతో చేసిన స్కూటర్లు రోడ్డుపై దర్శనం ఇస్తున్నాయి. అయితే స్కూటర్లు నడిచేందుకు ఉప్పు సాంకేతికత ఎలా పని చేస్తుంది? దాని ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం..

Salt Powered Scooters: ఉప్పుతో నడిచే స్కూటర్లు వచ్చేశాయి.. ధర తక్కువ మన్నిక ఎక్కువ.. మన దేశంలో ఎప్పుడంటే..
Salt Powered Scooters
Follow us
Surya Kala

|

Updated on: Jun 07, 2025 | 8:34 PM

ఇప్పటివరకు మీరు రోడ్లపై పెట్రోల్, డీజిల్, లిథియం బ్యాటరీలతో నడిచే స్కూటర్లను చూసి ఉంటారు. అయితే త్వరలో కొత్త యుగం రాబోతోంది. అవును త్వరలో ఉప్పుతో నడిచే స్కూటర్లను చూడనున్నారు. ఇప్పటికే చైనాలో, సముద్రపు ఉప్పుతో తయారు చేసిన సోడియం-అయాన్ బ్యాటరీలతో నడిచే స్కూటర్లు ఇప్పుడు రోడ్లపైకి వచ్చేశాయి. ఈ రోజు ఈ స్కూటర్లు ఎలా పని చేస్తాయి? అవి భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాయో పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం..

ఈ సాల్ట్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది?

చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికీ లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నాయి. ఇవి ఖరీదైనవి, ఛార్జింగ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటాయి. అయితే ఈ కొత్త టెక్నాలజీలో..సోడియం (ఉప్పు)తో తయారు చేసిన బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇవి చౌకగా ఉండటమే కాదు త్వరగా ఛార్జ్ అవుతాయి కూడా.. ఈ సాల్ట్ బ్యాటరీలను కేవలం 15 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని చెబుతున్నారు. అంతేకాదు ఈ బ్యాటరీల ధర లిథియం బ్యాటరీ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది పర్యావరణానికి సురక్షితమైన ఎంపిక కూడా.

సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల ధర ఎంత అంటే

ఈ స్కుటర్ల ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఈ స్కూటర్లు చైనాలో మన దేశ కరెన్సీలో రూ. 35,000 నుంచి 51,000 మధ్య లభిస్తున్నాయి. అంటే ఇవి పెట్రోల్ లేదా ఖరీదైన EV స్కూటర్ల కంటే చాలా చౌకగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ టెక్నాలజీ గేమ్ ఛేంజర్‌గా ఎందుకు మారింది?

లిథియం కొరత, ఖరీదైన మైనింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. లిథియంను అధికంగా వాడటం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అంతేకాదు లిథియంతో పోల్చితే సోడియం సులభంగా లభిస్తుంది, ఇది మహాసముద్రాలలో సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ఈ బ్యాటరీలు చౌకగా, మన్నికైనవి , పర్యావరణ అనుకూలమైనవిగా ఉన్నాయి.

ఈ స్కూటర్లు భారతదేశానికి ఎప్పుడు వస్తాయి?

భారతదేశంలో ఇప్పటికే ఈ సాల్ట్ బ్యాటరీ స్కూటర్ల తయారీపై పలు కంపెనీలు అంటే ఓలా, అథర్, హీరో ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పుడు ఈ దిశలో తయారీపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వం కూడా స్థిరమైన బ్యాటరీ సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. మన దేశంలో ఈ స్టాట్ బ్యాటరీ ఇంకా పరిశోధన దశలోనే ఉన్నప్పటికీ.. రాబోయే కొన్ని సంవత్సరాలలో “ఉప్పుతో నడిచే స్కూటర్” భారతదేశ రోడ్లపై కూడా నడుస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం