Russia Ukraine War: యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?

Russia Ukraine War: యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే?
Untitled 1 Copy

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు నగరాలను టార్గెట్‌ చేసిన రష్యా దళాలు.. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్‌ ప్లాంట్‌పైనే మిస్సైల్స్‌తో దాడి చేశాయి.

Balaraju Goud

|

Mar 04, 2022 | 2:42 PM

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు నగరాలను టార్గెట్‌ చేసిన రష్యా దళాలు.. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్‌ ప్లాంట్‌(Nuclear Power Plant)పైనే మిస్సైల్స్‌తో దాడి చేశాయి. ఉక్రెయిన్‌లో అతి పెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జప్రోజియా(Zaporizhzhia)పై పలు మార్లు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే.. అక్కడ జరిగిన నష్టంపై తాజాగా ఉక్రెయిన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. న్యూక్లియర్‌ ప్లాంట్‌పై జరిగిన దాడిలో.. ఏదైనా జరుగరానిది జరిగితే.. ఆ నష్టం ఊహించుకోవడానికి కూడా వీలు లేని విధంగా అపార నష్టం జరిగే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణ నష్టంతో పాటు.. న్యూక్లియర్‌ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరో వైపు.. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల న్యూక్లియర్‌ ప్లాంట్‌పై ఐక్యరాజ్యసమితితో పాటు.. ప్రపంచ దేశాలు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నాయి. ఉక్రెయిన్‌లోని అణు రియాక్టర్లకు ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితిలోని సంబంధిత డిపార్ట్‌మెంట్‌ అలర్ట్‌ చేసింది. ఉద్దేశపూర్వక దాడి వల్లనే కాకుండా ఎవరి పొరపాటు వల్లనైనా సమస్య తలెత్తే అవకాశం ఉందని వార్నింగ్‌ ఇచ్చింది. అటు.. అణు ఇంధన వ్యవస్థ భద్రతపై రష్యా, ఉక్రెయిన్‌ దృష్టి సారించాలని చైనా కూడా సూచించింది.

యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. దీంతో అక్కడ మంటలు చెలరేగడంతో సకాలంలో అదుపులోకి వచ్చింది. ఐదు అంతస్తుల శిక్షణా కేంద్రంలో మంటలు చెలరేగాయి. జప్రోజియా ప్లాంట్‌కు ఎటువంటి నష్టం జరగలేదు. ఇంతకు ముందు , ఉక్రెయిన్ అత్యవసర సేవ ఇక్కడ అనుమతించలేదు. అయితే తర్వాత దీనికి అనుమతి లభించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక మీడియా తెలిపింది. ఇప్పుడు తాజా ప‌రిస్థితి ఏంట‌ని స‌మాచారం.

ఈ ఘటనపై ఉక్రెయిన్ తరఫున ఓ ప్రకటన విడుదలైంది. ఇందులో మార్చి 4వ తేదీ ఉదయం, రష్యా జప్రోజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై కాల్పులు జరిపిందని, దాని కారణంగా సైట్ మంటలు చెలరేగిందని తెలిపారు. ఉక్రెయిన్‌లోని అత్యవసర సేవా విభాగం ఉదయం 6.20 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఎవరికీ గాయాలు లేదా మరణాల నివేదిక లేదు. జప్రోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పింది. అయితే యూనిట్ 1 రియాక్టర్ కంపార్ట్‌మెంట్ అనుబంధ భవనం దెబ్బతింది.

భవనానికి జరిగిన నష్టం యూనిట్ భద్రతను ప్రభావితం చేయలేదు. అణు విద్యుత్ ప్లాంట్లు, వ్యవస్థలు సక్రమంగా పని చేసే భద్రతకు అవసరమైన అంశాలు యధావిథిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రేడియేషన్ స్థితిలో ఎటువంటి మార్పు నమోదు కాలేదు. SNRIU ఇన్ఫర్మేషన్ అండ్ క్రైసిస్ సెంటర్ యాక్టివేట్ చేయడం జరిగింది. SNRIU, SSTC NRS నిపుణులు జప్రోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మేనేజర్‌లతో టచ్‌లో ఉన్నారు.

అయితే, మొదటి యూనిట్ పనులు ఆగిపోయాయని ప్రకటనలో పేర్కొన్నారు. రెండవ, మూడవ యూనిట్లు గ్రిడ్ నుండి డిస్‌కనెక్ట్ చేయడం జరిగింది. అణు సంస్థాపన చల్లబరుస్తుంది. నాలుగో యూనిట్ 690 మెగావాట్ల విద్యుత్‌తో పని చేస్తోంది. కాగా ఐదు, ఆరో యూనిట్లు కూడా చల్లబడుతున్నాయి. ఉక్రెయిన్ న్యూక్లియర్ ఇన్స్‌పెక్టర్లు రష్యా దళాలు ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలోకి ప్రవేశించాయని, రాత్రిపూట ఘర్షణలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. పవర్ ప్లాంట్ సిబ్బంది సాధారణ భద్రతా నిబంధనలకు అనుగుణంగా రియాక్టర్‌ను ఆపరేట్ చేయడం, విద్యుత్ సరఫరా చేయడం కొనసాగించారని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం, జప్రోజియా అణు విద్యుత్ ప్లాంట్ రష్యా సైన్యం నియంత్రణలో ఉంది.

ఇదిలావుంటే, రష్యా బాంబు దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై దాడి జరగడం చరిత్రలోనే మొదటిసారని అన్నారు. న్యూక్లియర్‌ ప్లాంట్లు ధ్వంసం అయితే.. యూరప్‌కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో 15 అణు విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల సాయం పెంచాలని ఆయన కోరారు.

రష్యాతో చేస్తున్న పోరాటంలో వెస్ట్‌ కంట్రీస్‌ అందిస్తున్న సాయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు ఆలస్యంగా స్పందిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే సాయాన్ని పెంచాలని అభ్యర్థించారు. లేని పక్షంలో రష్యా ఐరోపాలోని మిగిలిన దేశాలను కూడా వదలదని వార్నింగ్‌ ఇచ్చారు. రష్యాకు చెక్‌ పెట్టేందుకు నో-ఫ్లై జోన్‌ను అమలు చేయాలని మరోసారి కోరారు.

Read Also…. Russia-Ukraine War: రష్యా యుద్ధంలో అతిపెద్ద దాడి.. వీడియో

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu