Russia-Ukraine War News: బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్.. గ్రౌండ్ జీరో నుంచి టీవీ9 రిపోర్టింగ్

Russia Ukraine Crisis: బాంబుల మోతతో ఉక్రెయిన్‌ దద్దరిల్లుతోంది.మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ఎంటరైన రష్యా బలగాలు, ఒకేసారి ముప్పేట దాడికి దిగాయ్‌.

Russia-Ukraine War News: బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్.. గ్రౌండ్ జీరో నుంచి టీవీ9 రిపోర్టింగ్
Russia Ukraine War.3
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 24, 2022 | 3:07 PM

Russia-Ukraine Conflict: బాంబుల మోతతో ఉక్రెయిన్‌ దద్దరిల్లుతోంది. రష్యా త్రివిధ దళాలు ఒకేసారి విరుచుకుపడటంతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా ఎటాక్స్‌లో ఇప్పటివరకు మూడు వందల మందికి పైగా మరణించినట్లు ప్రకటించింది ఉక్రెయిన్‌.రష్యా దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్‌. రష్యా ఎటాక్స్‌ నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామంటామన్నారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.ఇది దురాక్రమణ చర్య అంటూ పుతిన్‌పై నిప్పులు చెరిగారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ. ప్రపంచ దేశాలు… పుతిన్‌ను నిలువరించాలని కోరారు. రష్యాను కంట్రోల్‌ చేయడం ఐరాస బాధ్యత అన్నారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ.రష్యాకు దీటుగా బదులిచ్చేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌లో మిలటరీ పాలన విధిస్తూ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో, రష్యాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్‌ సైన్యం.

ఉక్రెయిన్‌లో డేరింగ్ రిపోర్టింగ్ చేస్తున్నారు టీవీ9 ప్రతినిధి అభిషేక్. రష్యా చేస్తున్న దాడులు, మిస్సైల్స్‌, బాంబుల శబ్దాలు తప్ప సామాన్య జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ సిచ్‌వేషన్‌ను అభిషేక్ అందిస్తారు.

మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ఎంటరైన రష్యా బలగాలు, ఒకేసారి ముప్పేట దాడికి దిగాయ్‌.ఉక్రెయిన్‌లోని మెయిన్‌ సిటీస్‌ను టార్గెట్‌ చేసింది రష్యా. కేపిటల్‌ కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.ఒకవైపు బెలారస్‌…. రెండోవైపు క్రీమియా… మూడోవైపు లుహాన్స్‌ అండ్ డొనేట్స్‌… ఇలా, మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను ముట్టడించిన రష్యా, త్రివిధ దళాలతో బాంబుల మోత మోగిస్తోంది. అక్కడ నెలకొన్న పరిస్థితిని టీవీ9 ప్రతినిధి అభిషేక్ అందిస్తారు

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..