Apple Product: సంచలన నిర్ణయం.. అక్కడ ఆపిల్‌ ఉత్పత్తుల విక్రయాల నిలిపివేత..!

Apple Product: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కొనసాగుతోంది. ఇక రష్యాలో ఆపిల్‌ కంపెనీ ఉత్పత్తుల విషయంలో అమెరికన్‌ టెక్నాలజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ ..

Apple Product: సంచలన నిర్ణయం.. అక్కడ ఆపిల్‌ ఉత్పత్తుల విక్రయాల నిలిపివేత..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2022 | 8:21 AM

Apple Product: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం కొనసాగుతోంది. ఇక రష్యాలో ఆపిల్‌ కంపెనీ ఉత్పత్తుల విషయంలో అమెరికన్‌ టెక్నాలజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) సైనిక దాడి కొనసాగతున్న నేపథ్యంలో రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ఆపిల్‌ (Apple) ప్రకటించింది. రష్యాలో అన్ని ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్‌ కంపెనీ రష్యాలో ఆపిల్‌ పే, ఇతర సేవలను పరిమితం చేసింది. ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తోంది. అమెరికా నేతృత్వంలోని పలు దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. ఇక కెనడా, స్వీడన్‌ కూడా రష్యా నుంచి బయలుదేరే విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. రష్యాను ఒంటరిగా చేయడానికి పాశ్చాత్య మిత్రదేశాలు సమిష్టిగా ఆర్థిక ఆంక్షలు విధించాలని డిసైడ్‌ అయ్యాయి. ఈ చర్యల కారణంగా విదేశీ కరెన్సీ నిల్వలను స్తంభింపజేశాయి. ఇలా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.

కాగా, రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటైన రష్యా.. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది. మొదటి విడత చర్చలు ముగిసిన తర్వాత కీవ్ నగరంపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న దృష్యా రష్యా అధ్యక్షడు పుతిన్ సైతం తమ కుటుంబాన్ని ఐలాండ్‌కు తరలించి బంకర్‌‌కు తరలించారు. అయితే.. ఈ రోజు రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మొదటి విడత చర్చలు విఫలం అయిన నేపథ్యంలో రెండో దశ జరిగే చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ దేశాలన్నీ చర్చలు సఫలం కావాలంటూ కోరుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

RBI: మూడు సహకార బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా

Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు..!