Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు..!

Banking News: ప్రతినెల బ్యాంకింగ్‌ రంగంలో అనేక నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా ఆధార్‌, పాన్‌ నమోదు, ఇతర నిబంధనలు ఉంటాయి. బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో మార్పులు,..

Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2022 | 7:36 AM

Banking News: ప్రతినెల బ్యాంకింగ్‌ రంగంలో అనేక నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా ఆధార్‌, పాన్‌ నమోదు, ఇతర నిబంధనలు ఉంటాయి. బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో మార్పులు, రుణాల ప్రాసెసింగ్‌ ఫీజుల్లో మార్పులు వంటివి చేస్తుంటాయి. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ (Canara Bank) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposit)పై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసుకునే వారికి అంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేసే వారికి ఇకపై అధిక రాబడి పొందవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇక కెనరా బ్యాంకు తాజాగా ఎఫ్‌డీ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంకు వెల్లడించింది. ఏడాది కాల పరిమితిలోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేటు 5.1 శాతానికి పెరిగింది. ఏడాది నుంచి రెండు సంవత్సరాల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.15 శాతానికి ఎగబాకింది.

ఇక 2-3 ఏళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.2 శాతంగా ఉంది. ఇక 3 నుంచి 5 ఏళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.45 శాతానికి పెరిగింది. 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 25 బేసిస్‌ పాయింట్ల పెరుగుదలతో 5.5 శాతానికి చేరింది. ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు సాధారణ కస్టమర్లతో పోలిస్తే 50 బేసిస్‌ పాయిట్ల వరకు అధిక వడ్డీ పొందవచ్చు. గృహ రుణం, వాహనాల రుణంపై ప్రాసెసింగ్‌ ఫీజు మాఫీ ప్రయోజనం అందిస్తోంది. ఈ ప్రయోజనం మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

RBI: మూడు సహకార బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా

Gold Silver Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..