Ukraine-Russia War: ఉక్రెయిన్‌లో ఆ గుర్తులున్న భవనాలపైనే ఎటాక్స్.. రష్యా రహస్యం అదేనా..?
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. రాజధాని కీవ్‌ను మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో చాలా దూకుడు ప్రదర్శించింది. అందుకు రష్యన్ సైన్యానికి సహకరించిన అంశాలేంటి?
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. రాజధాని కీవ్‌ను మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో చాలా దూకుడు ప్రదర్శించింది. అందుకు రష్యన్ సైన్యానికి సహకరించిన అంశాలేంటి? కొన్ని బిల్డింగ్‌లపై ఆ మార్క్‌లేంటి? వివరాలు చూద్దాం.. ఉక్రెయిన్‌ను తమ దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది రష్యా. ఓవైపు చర్చలంటూనే మరోవైపు యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో రష్యన్ సైనికులు వేస్తున్న బాంబులు టార్గెట్‌ను ఛేదిస్తున్నాయా? గురి తప్పుతున్నాయా? ఎందుకంటే.. జనావాసాలపైనా బాంబుల వర్షం కురుస్తోంది. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లను, షాపింగ్ కాంప్లెక్స్‌లను, సూపర్ మార్కెట్లను టార్గెట్ చేసుకున్నట్టు మిస్సైళ్లు దూసుకొస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. భీకర దాడులకు తెగబడుతోన్న రష్యన్ సేనలు.. పౌరులపైనా దాడులకు పాల్పడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లోని భవనాలపై కొన్ని గుర్తులు (mystery symbols) కనిపిస్తున్నాయి. ఇవి ఏమిటి? ఎవరు వేశారు? అనేది మిస్టరీగా మారింది. అయితే.. తాము దాడులు చేసేందుకు రష్యా పెడుతున్న టార్గెట్‌లుగా జెలెన్‌స్కీ యంత్రాంగం అనుమానిస్తోంది. వెంటనే ఎత్తైన భవనాలపై ఇలాంటి ప్రత్యేక గుర్తులు కనిపిస్తే.. వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని స్పష్టంచేశారు.
రష్యన్ సైన్యం ఇప్పటివరకు చేరని ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్‌లపై ఈ మార్కింగ్ ఎవరు చేశారు? ఉక్రెయిన్‌లో ఇంటిదొంగలున్నారా? వాళ్లే ఇంటి గుట్టు బయటపెడుతున్నారా? ఇప్పుడీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లోకి ప్రవేశించిన రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌లో కొందరు సహకరిస్తున్నారని అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. మరీ ముఖ్యంగా పుతిన్ సైనికులకు అత్యంత కష్టంగా మారిన కీవ్ నగరంలో చాలా భవనాలపై ఎరుపురంగులో X గుర్తులు ఉండడం వారి అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది.
ఉక్రెయిన్ రాజధాని నగరంలోనే కాదు.. రీవ్నే సిటీలోనూ ఇలాంటి గుర్తులు కనిపిస్తున్నాయి. దీంతో పెద్ద భవనాలపై అటువంటి గుర్తులేమైనా ఉంటే వాటిని కవర్ చేయాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచిస్తున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపించినా వెంటనే భద్రతా బలగాలను అలర్ట్ చేయాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది.
Also Read: