AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia – Ukraine Crisis: ఉక్రెయిన్ – రష్యా వార్ ఎఫెక్ట్.. సైనికులకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన మోడల్.. ఆ పనికి కూడా ఓకే అంటూ..!

Russia - Ukraine Crisis: ఐదుగు రోజులుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యన్ సేనలను ఉక్రెయిన్‌పై రెచ్చిపోతున్నారు.

Russia - Ukraine Crisis: ఉక్రెయిన్ - రష్యా వార్ ఎఫెక్ట్.. సైనికులకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన మోడల్.. ఆ పనికి కూడా ఓకే అంటూ..!
Model Offer
Shiva Prajapati
|

Updated on: Mar 02, 2022 | 7:16 AM

Share

Russia – Ukraine Crisis: ఐదుగు రోజులుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యన్ సేనలను ఉక్రెయిన్‌పై రెచ్చిపోతున్నారు. బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను టార్గె్ట్‌గా చేసుకుని ముప్పేటా దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడులపై ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా స్వదేశంలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడులను ఆపేయాలంటూ రష్యాకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాస్కోలోని ప్రధాన వీధుల్లోకి వచ్చి.. ప్లకార్డులు చేతపట్టుకుని ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. తమ దేశ అధ్యక్షుడు తీరును తప్పు పడుతున్నారు. మరోవైపు ఈ నిరసనకారులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు అక్కడి పోలీసులు. ఇలా ఇంటా భయటా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్‌కేర్ అంటున్నారు. దేశ రక్షణే తన లక్ష్యమని, ఉక్రెయిన్‌పై తగ్గేదే లేదంటున్నారు.

ఇదిలాఉంటే.. రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. అక్కడి పరిస్థితులు మరింత హృదయవిదారకంగా ఉన్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాంతో అక్కడి పరిస్థితులు చూసి యావత్ ప్రపంచం సానుభూతి వ్యక్తం చేస్తోంది. జరిగిన నష్టం చాలు.. ఇక యుద్ధాన్ని ఆపేయండని కోరుకుంటున్నారు. అయితే, తాజాగా రష్యాకు చెందిన ఓ మోడల్ సంచలన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అనే చెప్పాలి.

రష్యా సైనికులు తమ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఆదేశాలను పాటించకుండా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేయకుండా ఉండే సైనికులతో తాను డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది రష్యా మోడల్ లిల్లీ సమ్మర్స్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలుస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా.. ఆ ఆఫర్‌ను ప్రకటించింది. ‘ఉక్రెయిన్‌పై ద్వేషం, ఆయుధాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి రష్యన్ సైనికుడితో నేను మింగిల్ అవడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ పేర్కొంది. ఈ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ఆపాలనే ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి ప్రకటన ఇచ్చింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆదేశ జెండాను పట్టుకుని అనేక ఫోటోలను పంచుకుంది. శాంతి శాంతి అంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి ప్రకటన చేసింది ఈ రష్యన్ మోడల్.

Also read:

Shibani Dandekar: పెళ్లి తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్న ఫర్హాన్‌ సతీమణి.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Hair Fall: అది ఎక్కువగా తింటే తలపై జుట్టు మిగలదు.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మామూలుగా ఉండవు..!

ప్రేమ విఫలమైందని.. రైలు పట్టాలపై పడుకుని.. యువకుడు ఆత్మహత్య