Russia Ukraine: అణ్వాయుధ ప్రయోగం తప్పదా..? పుతిన్‌ తన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించింది అందుకేనా.?

రష్యా, ఉక్రెయిన్‌ల (Russia Ukraine)మధ్య భయానక పరిస్థితులు రోజురోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఓవైపు ప్రపంచ దేశాలు రష్యా తీరును వ్యతిరేకిస్తున్న...

Russia Ukraine: అణ్వాయుధ ప్రయోగం తప్పదా..?  పుతిన్‌ తన కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించింది అందుకేనా.?
Vladimir Putin
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2022 | 7:30 AM

Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్‌ల (Russia Ukraine)మధ్య భయానక పరిస్థితులు రోజురోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఓవైపు ప్రపంచ దేశాలు రష్యా తీరును వ్యతిరేకిస్తున్న దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ (Putin) తీరు మాత్రం మారడం లేదు. తగ్గేదేలే అన్నట్లు ఉక్రెయిన్‌పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఓవైపు చర్చలు అంటేనే మరోవైపు బాంబుల దాడులు కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధం ఇప్పటితో ఆగదా.? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే.. పుతిన్‌ తన కుటుంబీకులందరినీ అత్యంత సురక్షితమైన బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలతో దాడులు చేసినా అత్యంత సురక్షితంగా ఉండే ఆ ప్రాంతానికి తన కుటుంబ సభ్యులందరినీ పుతిన్‌ పంపించారని బ్రిటన్‌కు చెందిన ఓ వార్త సంస్థ తెలిపింది.

అణు యుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడిన బంకర్‌ని ఏర్పాటు చేశారని సదరు వార్త సంస్థ తెలిపింది. అట్లయ్‌ పర్వత ప్రాంతంలో ఈ బంకర్‌ను ఏర్పాటు చేశారని బ్రిటన్‌ మీడియా తెలిపిది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా పుతిన్‌ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని సదరు వార్త సంస్థ తెలపడం గమనార్హం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతున్న నేపథ్యంలో పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్‌కు తమ దేశంపై అణు దాడి జరగుందన్న అనుమానం ఉందా అన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రష్యా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వెనక అసలు కారణమేంటో కాలమే సమాధానం చెప్పాలి.