మళ్ళీ అట్టుడుకుతున్న హాంకాంగ్. . ప్రజ్వరిల్లిన హింస… పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ..
హాంకాంగ్ మళ్ళీ అట్టుడుకుతోంది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య చెలరేగిన ఘర్షణలు, హింసాకాండలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పులు, బాష్పవాయు ప్రయోగం సందర్భంగా 14 ఏళ్ళ బాలుడు మరణించడంతో హాంకాంగ్ తిరిగి అల్లర్లతో దాదాపు అగ్నిగుండమైంది. నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించి పెద్దఎత్తున వీధుల్లో ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.. బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అటు-ఆందోళనకారులు కూడా పెట్రోలు బాంబులతో వారిపై తిరగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. సాధారణ దుస్తుల్లో […]
హాంకాంగ్ మళ్ళీ అట్టుడుకుతోంది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య చెలరేగిన ఘర్షణలు, హింసాకాండలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పులు, బాష్పవాయు ప్రయోగం సందర్భంగా 14 ఏళ్ళ బాలుడు మరణించడంతో హాంకాంగ్ తిరిగి అల్లర్లతో దాదాపు అగ్నిగుండమైంది. నిరసనకారులు ముఖాలకు మాస్కులు ధరించి పెద్దఎత్తున వీధుల్లో ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.. బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అటు-ఆందోళనకారులు కూడా పెట్రోలు బాంబులతో వారిపై తిరగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. సాధారణ దుస్తుల్లో ఉన్న ఓ పోలీసుపై ఆందోళనకారులు రెచ్చిపోయి మూకుమ్మడిగా దాడి చేయడంతో బాటు అతనిపై పెట్రోలు బాంబు విసిరారు. దాంతో తీవ్రంగా గాయపడి.. శరీరం కాలిపోతున్న స్థితిలో ఆ పోలీసు పరుగులెత్తాడు. అదృష్టవశాత్తూ ఈ ‘ బాంబు ‘ దాడిలో సోకిన మంటలను తనకు తానే ఆర్పుకుంటూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఇటీవలే చైనా ప్రతిపాదించిన నేరస్థుల అప్పగింత బిల్లుకు నిరసనగా హాంకాంగ్ లో నెలరోజులకు పైగా ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనల్లో అనేకమంది పోలీసులు కూడా గాయపడ్డారు. చివరకు నిరసనకారుల ఉద్యమానికి తలొగ్గిన హాంకాంగ్ ప్రభుత్వం వివాదాస్పదమైన బిల్లు పట్ల వెనక్కి తగ్గింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఈ నగరం మళ్ళీ అల్లర్లతో అట్టుడకడం విశేషం.