‘ నా అభిశంసనా ? రెడీ ! వాళ్ళకా హక్కులున్నాయి ‘ !

తనను అభిశంసించడానికి డెమోక్రాట్లకు తగిననన్ని ఓట్లు ఉన్న విషయం నిజమేనని అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘ ఇది నిజమే ! అయితే నన్ను పదవి నుంచి తొలగించాలా, వద్దా, అన్న విషయమై సెనేట్ విచారణకు స్పీకర్ నాన్సీ పెలోసీ లాంఛనంగా హౌస్ లో ఓటింగ్ నిర్వహించాలి ‘ అని ఆయన సూచించారు. శుక్రవారం తనను కలిసిన జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన.. ‘ వాళ్ళు (డెమొక్రాట్లు) మా హక్కులన్నీ లాగేసుకున్నారు ‘ అని ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో […]

' నా అభిశంసనా ? రెడీ ! వాళ్ళకా హక్కులున్నాయి ' !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Oct 05, 2019 | 11:45 AM

తనను అభిశంసించడానికి డెమోక్రాట్లకు తగిననన్ని ఓట్లు ఉన్న విషయం నిజమేనని అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘ ఇది నిజమే ! అయితే నన్ను పదవి నుంచి తొలగించాలా, వద్దా, అన్న విషయమై సెనేట్ విచారణకు స్పీకర్ నాన్సీ పెలోసీ లాంఛనంగా హౌస్ లో ఓటింగ్ నిర్వహించాలి ‘ అని ఆయన సూచించారు. శుక్రవారం తనను కలిసిన జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన.. ‘ వాళ్ళు (డెమొక్రాట్లు) మా హక్కులన్నీ లాగేసుకున్నారు ‘ అని ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో తాను జరిపిన ఫోన్ కాల్ వ్యవహారంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్న వేళ.. ట్రంప్ చాలా అసహనంగా కనిపించారు. ‘ వాళ్లంతా వరుసగా లైన్లో నిలబడ్డారు.. వాళ్లలో చాలామందికి అసలు ఓటింగ్ లో పాల్గొనాలన్న ఆసక్తే లేదు.. కానీ మరో ఛాన్స్ లేదు. తమ నాయకుల ఆదేశాలను వారు పాటించాల్సిందే ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. సెనేట్ లో జరిగే విచారణలో తాము నెగ్గి తీరుతామన్నారు.’ నన్ను మా రిపబ్లికన్ పార్టీ తప్పకుండా రక్షిస్తుంది.. ఆ నమ్మకం నాకుంది ‘ అన్నారాయన. కాగా-అప్పుడే ఇద్దరు రిపబ్లికన్లు ఆయనతో విభేదించారు. మాజీ ఉపాధ్యక్షుడు, వచ్ఛే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జోబిడెన్ అవినీతిపై విచారణ జరిపించాలంటూ ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని ట్రంప్ కోరడాన్ని వారు తప్పు పట్టారు. ఇదే విషయమై ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఇన్స్ పెక్టర్ జనరల్ మైఖేల్ అట్ కిన్సన్ నిన్న తమ పార్టీకి చెందిన ఇతర సభ్యులను కలిశారు. ట్రంప్ పై ఫిర్యాదు చేసిన అజ్ఞాత వ్యక్తి వాదన నమ్మదగినదిగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా…. తన పట్ల అభిశంసన తీర్మానానికి సిధ్ధపడిన డెమొక్రాట్ల పట్ల ట్రంప్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. జో బిడెన్ అవినీతిపై విచారణ జరిపించాలని ఉక్రెయిన్ తో \బాటు చైనా ను కూడా ట్రంప్ డిమాండ్ చేశారు. తనను విమర్శిస్తున్నవారిని ఆయన ద్రోహులుగా అభివర్ణించారు.’ ఉక్రెయిన్ మాదిరే చైనా కూడా బిడెన్ అవినీతిపై విచారణ జరిపించాల్సిందే. ఆ దేశంలో ఆయనకు, ఆయన కుమారుడు హంటర్ కు పలు వ్యాపారాలున్నాయి. తమ అవినీతితో వాళ్ళు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు ‘ అని ట్రంప్ పేర్కొన్నారు. అటు-2014 లో యుఎస్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించిన జోబిడెన్ .. తన కొడుకు, తన భాగస్వామి కూడా అయిన హంటర్ అవినీతిపై విచారణ జరిపించాలన్న ట్రంప్ కోర్కెను తోసిపుచ్చారు. ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబధ్ధాలు అని కొట్టిపారేశారు. ఎలాంటి విచారణకైనా తాము సిధ్ధమేనని బిడెన్ ప్రకటించారు. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ అభిశంసన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయనను దోషిగా నిలబెట్టాలని డెమొక్రాట్లు గట్టి పట్టుదలతో ఉండగా.. సెనేట్ లో ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాలని రిపబ్లికన్లు కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. సెనేట్ లో వీరికి మెజారిటీ ఉండడం ట్రంప్ కు కలిసొచ్ఛే అంశం.

.