AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాంటీ ఇండియా పనులు.. విదేశీ పౌరసత్వం పోగొట్టుకున్న UK ప్రొఫెసర్‌!

బ్రిటిష్ కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్‌కు భారత ప్రభుత్వం ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (OCI) రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలను ఆమె తిరస్కరిస్తూ, ఇది ప్రతీకార చర్య అని పేర్కొన్నారు. బెంగళూరు సమావేశానికి హాజరు కాకుండా ఆమెను అడ్డుకున్నారని కూడా ఆమె తెలిపారు.

యాంటీ ఇండియా పనులు.. విదేశీ పౌరసత్వం పోగొట్టుకున్న UK ప్రొఫెసర్‌!
Nitasha Kaul
SN Pasha
|

Updated on: May 20, 2025 | 11:53 AM

Share

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో పొలిటిక్స్‌, అంతర్జాతీయ సంబంధాలపై బోధించే బ్రిటిష్ కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కోల్పోయారు. భారత వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై భారత అధికారులు ఆమె OCIని రద్దు చేశారని ఆమె స్వయంగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుండి అందిన సమాచారం వివరాలను నితాషా కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది దుర్మార్గం, వాస్తవాలు లేదా చరిత్రను పూర్తిగా విస్మరించి తనపై ఈ చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావడానికి ఇండియాకు రాకుండా తనను అడ్డుకున్నారంటూ కూడా నితాషా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో దేశంలో ఉండేవారు ప్రశ్నించడానికి ధైర్యం చేయకుండా, దేశం బయటి నుంచి చూసే వారికి కూడా ఆ ధైర్యం లేకుండా చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన OCI నిబంధనల ప్రకారం.. భారత ప్రభుత్వం ఏ వ్యక్తి OCI రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాల వల్ల రద్దు చేయవచ్చు.

భారత ప్రభుత్వం నుండి అందిన పౌరసత్వ రద్దు పత్రం సారాంశం ఏంటంటే.. కౌల్ భారతదేశ సార్వభౌమాధికార విషయాలపై భారతదేశం, దాని సంస్థలను లక్ష్యంగా చేసుకుని వివిధ అంతర్జాతీయ వేదికలలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనేక శత్రు రచనలు ప్రసంగాలు, పాత్రికేయ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్ నితాషా కౌల్ తన OCI రద్దును “దుష్ట విశ్వాసం, ప్రతీకారపూరితమైన, క్రూరమైన అంతర్జాతీయ అణచివేతకు ఉదాహరణ” అని ఖండించారు. మైనారిటీ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పండిత కృషి చేసినందుకు తానకు ఈ ఫలితం దక్కిందని అన్నారు.

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్క డ క్లిక్ చేయండి