Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. అప్యాయంగా ఆహ్వానించిన ప్రధాని జేవియర్‌ మిలై

అర్జెంటీనాలోని ఎజీజా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అర్జెంటీనా రిపబ్లిక్ అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ అర్జెంటీనాకు అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి.

అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. అప్యాయంగా ఆహ్వానించిన ప్రధాని జేవియర్‌ మిలై
Pm Modi Argentina Visit
Balaraju Goud
|

Updated on: Jul 05, 2025 | 8:43 AM

Share

అర్జెంటీనాలోని ఎజీజా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అర్జెంటీనా రిపబ్లిక్ అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ అర్జెంటీనాకు అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. కీలక రంగాలలో భారతదేశం-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే మార్గాలపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించడానికి అర్జెంటీనా అధ్యక్షుడు మిలేతో ప్రధానమంత్రి మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ట్రినిడాడ్-టొబాగోలో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న తర్వాత, ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనకు వచ్చారు. జూలై 2 నుండి జూలై 10 వరకు ప్రధాని మోదీ 5 దేశాల పర్యటనలో ఉన్నారు. ఘనా, ట్రినిడాడ్-టొబాగో తర్వాత ఆయన అర్జెంటీనాకు చేరుకుంటారు. దీని తరువాత, ఆయన తదుపరి బ్రెజిల్‌లో పర్యటిస్తారు.

శుక్రవారం(జూలై 04) రాత్రి అర్జెంటీనాకు రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని అయిన తర్వాత ఇది అర్జెంటీనాకు మోదీ రెండో పర్యటన. అంతకుముందు, 2018లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన అర్జెంటీనా వెళ్లారు. ప్రధాని మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ జేవియర్ మిల్లీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. దీంతో పాటు, ఆయన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా, భారతదేశం-అర్జెంటీనా మధ్య రక్షణ, వ్యవసాయం, ఇంధనం, అణు సహకారం, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య లిథియం సరఫరాపై ఒప్పందం కూడా సాధ్యమే. అర్జెంటీనా ప్రపంచంలో మూడవ అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది.

ఈరోజు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆయన ఇండియా-అర్జెంటీనా బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొంటారు. ఆయన ముఖ్యమైన ఒప్పందాలపై (MoUలు) కూడా సంతకం చేస్తారు. భారత సంతతికి చెందిన వ్యక్తులతో ఆయన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. దీని తర్వాత, ఆదివారం (జూలై 6) ఆయన అర్జెంటీనా విదేశాంగ మంత్రి, వాణిజ్య మంత్రి, ఇంధన మంత్రితో సమావేశం కానున్నారు. ఇక్కడ ఆయన లిథియం, ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరా వంటి అంశాలపై ఒక ఒప్పందం చేసుకోనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ బ్రెజిల్‌కు బయలుదేరి, బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి