25 దేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీ
భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ట్రినిడాడ్-టొబాగోఅత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో, రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ సహా అనేక దేశాల నుండి ఆయన అత్యున్నత గౌరవాలను కూడా అందుకున్నారు. ఇప్పటికి 25 దేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్రినిడాడ్-టొబాగో అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్-టొబాగో’ లభించింది. ఈ గౌరవాన్ని ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టీన్ కంగలూ ఆయనకు ప్రదానం చేశారు. ఇది ఒక విదేశీ దేశం ప్రధానమంత్రి మోడీకి ఇచ్చిన 25వ అంతర్జాతీయ గౌరవం. గతంలో, రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ సహా అనేక దేశాల నుండి ఆయన అత్యున్నత గౌరవాలను కూడా అందుకున్నారు. ఇప్పటి వరకు విదేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.
ఈ గౌరవంతో, ప్రధానమంత్రి మోదీ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్-టొబాగో చరిత్రలో ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా నిలిచారు. ఈ గౌరవాన్ని భారత్-ట్రినిడాడ్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వేదికలలో భారతదేశం చురుకైన పాత్ర, ప్రధానమంత్రి మోదీ నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నారు.
అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను అందుకున్నందుకు మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ గౌరవాన్ని నేను ఉమ్మడి గర్వంగా అంగీకరిస్తున్నాను. ఈ గౌరవం మొదటిసారిగా ఒక విదేశీ నాయకుడికి ఇవ్వడటం మన ప్రత్యేక సంబంధాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంబంధం మన ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వంపై ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
180 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి ఇక్కడికి వచ్చిన ప్రజలు మన స్నేహానికి పునాది వేశారని ప్రధాని మోదీ అన్నారు. వారి చేతులు ఖాళీగా ఉన్నప్పటికీ, వారి మనస్సులు భారతీయ నాగరికత, సంస్కృతి, వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. వారు నాటిన పరస్పర సామరస్యం, సద్భావన విత్తనాలు నేడు ట్రినిడాడ్ సాకారం అవుతున్నాయి. మన ఉమ్మడి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను ఇప్పటికీ భారతీయ సమాజం పరిరక్షించడం చాలా గర్వకారణం అని ప్రధాని మోదీ కొనియాడారు.
అధ్యక్షుడు కనగలును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, మీ పూర్వీకులు తమిళనాడుకు చెందినవారని, ఇది తిరువళ్ళువర్ జీ పుట్టిన ప్రదేశం అని అన్నారు. బలమైన దేశాలకు 6 విషయాలు ఉండాలని తిరువళ్ళువర్ జీ అన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ధైర్యవంతులైన సైన్యం, దేశభక్తిగల పౌరులు, వనరులు, మంచి ప్రజా ప్రతినిధులు, బలమైన రక్షణ, ఎల్లప్పుడూ మనతో పాటు నిలిచే స్నేహపూర్వక దేశాలు. ట్రినిడాడ్-టొబాగో భారతదేశానికి చాలా స్నేహపూర్వక దేశం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ట్రినిడాడ్ అధ్యక్షురాలు క్రిస్టీన్, ప్రధాని కమలాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ట్రినిడాడ్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..