Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంచ్‌కు వచ్చి.. అందరి బిల్లు కట్టి ..! సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యువరాజు

లంచ్‌కు వచ్చి.. అందరి బిల్లు కట్టి ..! సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యువరాజు

Phani CH
|

Updated on: Jul 04, 2025 | 4:23 PM

Share

ఓ రెస్టరంట్‌ను సందర్శించిన ఆ దేశపు యువరాజు అక్కడున్న వారందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వారందరి బిల్లులు చెల్లించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు అంటే దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం. షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ను ముద్దుగా ‘ఫజా’ అని పిలుస్తుంటారు.

అరబిక్‌లో సాయం చేసే వాడు అని అర్థం. అబుదాబీ యువరాజుతో కలిసి షేక్‌ హమ్దాన్‌ స్థానిక మాల్‌లో ఉన్న ఓ ఖరీదైన రెస్టరంట్‌ కు వెళ్లారు. ఆయన వెంట కొంతమంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వచ్చారు. యువరాజుల రాకను గమనించిన అక్కడున్నవారు ఎంతో సంబరపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ మహిళ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని చెప్పిన ఆమె.. రెస్టరంట్‌కు వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పింది. ఆ మొత్తం రూ.6 నుంచి 7లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకుటుంబం తీరు అద్భుతంగా ఉందని కొందరు కామెంట్‌ చేసారు.. దాతృత్వంలో తండ్రి షేక్‌ మహమ్మద్‌ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. యువరాజు రాక మరచిపోని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్న ఆమె.. రెస్టరంట్‌కు వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పారు. ఆ మొత్తం రూ.6 నుంచి 7లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకుటుంబం తీరు అద్భుతంగా ఉందని కొందరు పేర్కొనగా.. దాతృత్వంలో తండ్రి షేక్‌ మహమ్మద్‌ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని అనేక మంది పోస్టులు పెడుతున్నారు. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌కు కవిత్వం, సాహస క్రీడలపై మక్కువ చూపే ఆయన.. పర్యావరణంతోపాటు దాతృత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయిన మగపాము పక్కనే రోజంతా ఆడపాము.. ప్రేమంటే ఇదేరా

అద్దెకి 3 BHK ఫ్లాట్‌.. 19 లక్షలు డిపాజిట్ కడితేనే

ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్

లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..