కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్
చేపలు పట్టడంలో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు. పెద్ద పెద్ద వలలు, గేలాలు పక్కన పారేసి, చేత్తో ప్లాస్టిక్ డబ్బా తీసుకుపోయి, బోలెడన్ని చేపలు పట్టుకుని ఎంచక్కా వచ్చేస్తున్నారు. తమదైన పద్ధతిలో గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులను ఆశ్చర్య పరుస్తున్నారు. ఏదైనా పాత్రలో దూరిన తర్వాత చేపలు ఇక వెనక్కి రావనే పాయింట్‌ను పట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత వాసులు.. ఈ కొత్త పద్ధతిలో చేపలు పడుతూ.. రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ బాటిల్ ట్రాప్ తో రెండు కిలోల చేపలు కూడా దొరుతున్నాయంటున్నారు ఈ ప్రాంత యువకులు. ఇందుకోసం వీరు ప్లాస్టిక్ బాటిల్, వరిపిండి లేదా మైదా పిండిని వాడుతున్నారు. ముందుగా ఓ ప్లాస్టిక్ సీసాను పైభాగం తొలగించి మిగిలిన దాంట్లో పిండి ముద్దను పెట్టి, ఆ బాటిల్‌ను నదిలోకి జారవిడుస్తున్నారు. సీసాలోని పిండిని తినేందుకు చేపలు అందులోకి వచ్చి అక్కడే చిక్కుకుంటూ వెనక్కి వెళ్లలేక ఇరుక్కుని, అటూ ఇటూ కొట్టుకుంటోంది. దీంతో వీరు వదిలిన తాడు కదులుతుంది. దీనిని గమనించగానే, టక్కున లాగేసి, ఆ చేపను పట్టుకుంటున్నారు. ఈ కొత్త టెక్నాలజీలో చేపలు బాగా పడుతుండటంతో నరసాపురం గోదావరి తీరంలో.. వందలాది మంది యువత ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకుని, చేపలు పట్టేందుకు వస్తున్నారు. వర్షాకాలం సీజన్ కూడా కావటంతో, గోదావరిలో చేపలు విరివిగా దొరుకుతుండటంతో వాటిని పట్టి మంచి ధరకు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్‌లో దీనివల్ల తమకు కొంతైనా ఆదాయం వస్తున్నందుకు ఇక్కడి యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..
దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే
ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్ మసాలా నూరుతున్న తమన్

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
