ఫుట్‌బాల్ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు
రోబోలు అంటే వంటలు చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వరకు చూశాం. ఇక ఏఐ టెక్నాలజీ వచ్చాక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి. అయితే అంతకు మించి అన్నట్లు రోబోలతో ఇప్పుడు క్రీడా పోటీలు పెట్టడం ఆసక్తిని రేపుతోంది. రోబోలతో స్పోర్ట్సా..? ఇది సాధ్యమేనా అని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే ఆల్రెడీ చైనా చేసి చూపించింది!
మనుషులే కాదు రోబోలు అదరగొట్టేలా ఫుట్ బాల్ ఆడగలవని నిరూపించారు చైనా పరిశోధకులు. ఇటీవల చైనా పురుషుల ఫుట్‌బాల్ జట్టు తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే మనుషులను పోలిన ఈ రోబోలు మాత్రం గురి చూసి మరీ గోల్ కొడుతుండటం చూసి పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. రోబోలకున్న అడ్వాన్స్‌డ్ విజువల్ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో అందర్నీ ఆకట్టుకున్నాయి. కిందపడినా మళ్లీ మనుషుల్లా పైకి లేచాయి. ఏఐ టెక్నాలజీ సహాయంతో ముందుకు కదలడం ఇలా ఒకటేమిటీ అన్ని రకాల ఫుట్‌బాల్ నైపుణ్యాల్ని ప్రదర్శించాయి. ఆటల్లో గాయపడిన రోబోలను స్ట్రెచర్ల సాయంతో సిబ్బంది బయటకు తీసుకెళ్లడం ఆటకే హైలెట్. త్వరలో జరిగే ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ పోటీలకు ప్రివ్యూగా శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో ఈ పోటీలు నిర్వహించారు. బూస్టర్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన నాలుగు హ్యూమనాయిడ్ రోబోట్ జట్లు ఈ పోటీల్లో కనువిందు చేశాయి. భవిష్యత్తులో మనుషులు, రోబోలు కలిసి ఆడే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదేమో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్
లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..
దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే
ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్ మసాలా నూరుతున్న తమన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

