పంతం నెగ్గించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్
అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. రిపబ్లికన్ సభ్యులు, అధికారుల సంబరాల మధ్య ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు.

అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. రిపబ్లికన్ సభ్యులు, అధికారుల సంబరాల మధ్య ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్‌లో ముగ్గురు రిపబ్లికన్‌లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైట్ హౌస్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పిక్నిక్ వేడుకలో ఎంపీలు, పరిపాలన అధికారులు, అతిథుల సమక్షంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా, ఈ బిల్లు అమెరికన్ కుటుంబాలు, వ్యాపారాలకు కొత్త ప్రారంభం అవుతుందని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి మేము పన్నులను తగ్గిస్తున్నామని, ఖర్చులను కూడా తగ్గిస్తున్నామని ఆయన అన్నారు.
ప్రజలు ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడూ చూడలేదని ట్రంప్ అన్నారు. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు. ఉత్సవంలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్‌హౌస్ సిబ్బంది తరలివచ్చారు.
ఈ బిల్లును అమలు చేయడం డొనాల్డ్ ట్రంప్, అతని రిపబ్లికన్ మిత్రులకు పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు. ఈ చట్టం అమెరికా ఆర్థికాభివృద్ధికి బలాన్ని ఇస్తుందని ట్రంప్ అన్నారు. అయితే, ఈ చట్టం కారణంగా అమెరికా అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లు, 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని రాజకీయేతర విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకుముందు, ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు బిల్లు ఖర్చు, ఆరోగ్య సేవలపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, 220 మంది రిపబ్లికన్ శాసనసభ్యులలో, ఇద్దరు సభ్యులు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేయగా, 212 మంది డెమొక్రాట్లు బిల్లును వ్యతిరేకించారు.
అయితే.. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించడం, కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి ఈ చట్టంలో ఉన్నాయి. అయితే లక్షలాది మంది అమెరికన్లు ఈ చట్టంతో ఆరోగ్య బీమా కోల్పోతారని అంతా భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..