అమెరికాలో రెండు పార్టీల వ్యవస్థ అంతమవుతుందా? సంచలనం సృష్టించిన్న ఎలోన్ మస్క్ పోస్ట్!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ని గెలిపించిన మస్క్.. ఇప్పుడు ఆయనకే ఎర్త్ పెట్టబోతున్నారా? అభిశంసన ద్వారా ట్రంప్‌ని గద్దె దించేసి, తాను ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవాలని కలలు కంటున్నారా? కొత్త పార్టీ పెట్టాలనే ప్లాన్ దానిలో భాగమేనా? అమెరికాలో మరో పార్టీ కావాలా వద్దా అని ఒపీనియన్ పోల్ పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం కూడా ఇదేనా?

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, బిలియనీర్ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా పోస్ట్ సంచలన సృష్టిస్తోంది. అమెరికన్ రాజకీయాల్లో మూడవ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు. సోషల్ మీడియా X లో ఒక సర్వే ద్వారా ఈ ఆలోచనను వ్యక్తం చేశారు. మనం అమెరికా పార్టీని ఏర్పాటు చేయాలా? వద్దా? అంటూ పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో సంచలన సృష్టిస్తోంది.
దీనిపై ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ, ఎలోన్ థర్డ్ పార్టీని ప్రారంభించడం టెస్లా, స్పేస్‌ఎక్స్‌లతో చాలా పోలి ఉంటుందని రాశారు. విజయవంతమయ్యే అవకాశాలు తక్కువ, కానీ అది విజయవంతమైతే, అది ఆటను పూర్తిగా మారుస్తుంది. మస్క్ దీనికి సానుకూలంగా స్పందించి, తాను ఆలోచనలపైనే కాకుండా సంభావ్య వ్యూహాలపై కూడా పని చేయగలనని చూపించాడు.
Independence Day is the perfect time to ask if you want independence from the two-party (some would say uniparty) system!
Should we create the America Party?
— Elon Musk (@elonmusk) July 4, 2025
ఎలోన్ మస్క్ థర్డ్ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన దానికదే ప్రత్యేకమైనది. అమెరికాలో థర్డ్ పార్టీలు ఎప్పుడూ పరిమితంగానే ఉన్నాయి. అయితే మస్క్ పేరు, బ్రాండ్ విలువ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. దీంతో పాటు, మస్క్ టెక్ కమ్యూనిటీ, స్వతంత్ర ఓటరు తరగతిలో లోతైన చొచ్చుకుపోయాడు. ట్రంప్ తీసుకువచ్చిన కొత్త చట్టం ఈ మొత్తం సంఘటనకు కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తీసుకువచ్చిన “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్”లో వలసదారుల బహిష్కరణ ప్రచారానికి భారీ బడ్జెట్ ఉంది. దీని కారణంగా, ఆర్థిక వ్యయానికి సంబంధించిన ప్రణాళికలు రాబోయే 10 సంవత్సరాలలో లోటును $3.3 ట్రిలియన్లు పెంచుతాయని భావిస్తున్నారు మస్క్. ఈ విషయంలో ట్రంప్-మస్క్ మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎలోన్ ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) ప్రధాన పదవికి రాజీనామా చేశారు.
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో ట్రంప్ ను ఎలోన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. ఈ బిల్లు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఆత్మహత్యాసదృశమని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ వ్యయం, అసమర్థతను ప్రోత్సహిస్తుందన్నారు. ఇది టెక్ కంపెనీలు, స్టార్టప్ లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మండిపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మస్క్ ను హెచ్చరించారు. మస్క్ కంపెనీలకు ఇచ్చే ఫెడరల్ సబ్సిడీని రద్దు చేస్తామని బెదిరించాడు. మస్క్ ఇమ్మిగ్రేషన్ స్థితిపై దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..