AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భారత్‌ చొరవతోనే ఉక్రెయిన్‌పై అణుదాడి ఆగింది.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు..

దీంతో ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. అయితే రష్యా అణుబాంబును ప్రయోగించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మాత్రం కొనసాగించింది. అయితే రష్యా అను బాండు దాడి చేయకపోవడంలో భారత్ పాత్ర ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వార్త సంస్థ సీఎన్‌ఎన్‌ ఈ...

PM Modi: భారత్‌ చొరవతోనే ఉక్రెయిన్‌పై అణుదాడి ఆగింది.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు..
Russia Ukrain War
Narender Vaitla
|

Updated on: Mar 10, 2024 | 8:44 PM

Share

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధానికి దిగి రెండేళ్లు గడుస్తున్నాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడం ఇష్టం లేని రష్యా ఆ దేశంపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా ఉక్రెయిన్‌కు అండగా నిలిచింది. సైనిక సహాయాన్ని సైతం అందించింది. అయితే యుద్ధం మొదలైన తొలి వారంలోనే రష్యా అణు బాంబు దాడికి దిగుతామని బెదిరించింది.

దీంతో ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. అయితే రష్యా అణుబాంబును ప్రయోగించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మాత్రం కొనసాగించింది. అయితే రష్యా అను బాండు దాడి చేయకపోవడంలో భారత్ పాత్ర ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వార్త సంస్థ సీఎన్‌ఎన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా సైతం రష్యా అణుబాంబును ప్రయోగిస్తుందని మొదటి నుంచి అనుమానించింది. ఒకవేళ అణుబాంబు ప్రయోగం జరిగితే ఎలా అన్న అంశంపై 2022లోనే అమెరికా పూర్తి కసరత్తు సైతం చేసింది.

ఇదిలా ఉంటే రష్యా అణుదాడికి పాల్పకుండా ఉండేలా చూసేందుకు అమెరికా.. భారత్‌, చైనాల సహాయాన్ని కోరింది. ఓవైపు రష్యాను హెచ్చరిస్తూనే మరోవైపు భారత్‌, చైనా వంటి దేశాలతో రష్యాకు చెప్పించినట్లు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలు రష్యా అణు బాంబు ప్రయోగం ఆలోచనను ఉపసంహరించేందుకు సహాయపడ్డాయి.

ఆ తర్వాత యుద్ధం ప్రతిష్టంభన దశకు చేరడంతో అణుదాడి ఆందోళనలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాలను మొత్తం ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించినట్లు సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తన కథనంలో వివరించింది. ఇదిలా ఉంటే గతేడాది ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన్‌ ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న సమయంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ.. ‘ఇది యుద్ధ యుగం కాదు’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..