India-Pakistan: మనతో మళ్లీ దోస్తీకి దాయాది దేశం తహతహ.. వందేళ్ల వరకు శత్రుత్వం కోరుకోవడం లేదంటూ..
సమయం దొరికినప్పుడల్లా మనపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్ మళ్లీ భారత్‌తో దోస్తీకి సిద్ధమవుతోంది. అవకాశం దొరికితే చాలు.. అంతర్జాతీయ వేదికపై
సమయం దొరికినప్పుడల్లా మనపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్ మళ్లీ భారత్‌తో దోస్తీకి సిద్ధమంటోంది. అవకాశం దొరికితే చాలు.. అంతర్జాతీయ వేదికపై ఇండియాపై బురద జల్లుతోన్న దాయాది మనతో మళ్లీ వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎల్‌వోసీ వెంట నిత్యం కాల్పులు జరుపుతూ దొంగ దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతోన్న ఆ పాకిస్తానే ఇప్పుడు మనతో వందేళ్ల స్నేహం కోరుకుంటున్నట్లు తెలిపింది. పాక్ మొట్టమొదటి సారిగా రూపొందించిన జాతీయ భద్రత విధాన పత్రం 2022-26లో ఈ విషయాలన్నీ తెలిపింది దాయాది దేశం. గత నెలలో పాకిస్థాన్ కేబినెట్, నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఆమోదించిన జాతీయ భద్రత విధానాన్ని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేడు(జనవరి14) లాంఛనంగా ఆవిష్కరించారు. ఇందులో భాగంగా కశ్మీర్ సమస్యతో పాటు పలు ఆసక్తికర విషయాలను ఇందులో ప్రస్తావించారు.
కాగా ఈ జాతీయ భద్రతా విధానంలో కొంత భాగాన్ని మాత్రమే ప్రస్తుతానికి బహిరంగపరుస్తున్నట్లు పాక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా భారత్- పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి కోసం ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యతో నిమిత్తం లేకుండా ఇరు దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి చొరవ తీసుకుంటామన్నారు . పాకిస్థాన్‌కు ఇప్పటికే రక్షణ, అంతర్గత భద్రత, విదేశాంగ విధానాలు ఉన్నాయనీ.. వీటన్నింటినీ జాతీయ భద్రత విధానం కిందకు తీసుకొస్తున్నామని వివరించారు. రాబోయే వందేళ్ల వరకు కూడా భారత్‌తో తాము శత్రుత్వం కోరుకోవడం లేదనీ.. ఇరుగుపొరుగుతో సఖ్యత ఆశిస్తున్నామని ఒక సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. అయితే భారత్ తో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేదని పరోక్షంగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా దిగజారింది. విదేశాలు ఆర్థిక సహాయం ఆపేయడంతో దాదాపు దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకున్నారు. ఈక్రమంలో మరింత మునిగిపోకుండా ఉండేందుకే ఇలా పొరుగు దేశాలతో స్నేహ హస్తం చాటేందుకు పాక్ ప్రయత్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాణిజ్య సంబంధాల ద్వారా మూలన పడిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ మెరుగుపరచుకోవాలని భావిస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌తో పాటు పక్క దేశాల దోస్తీకి సై అంటోందని భావిస్తున్నారు.
Malladi Chandrasekhara Sastry: పౌరాణిక వాచస్పతి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం..
Nokia Earbuds: నోకియా నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్స్..!