Food Emergency: పాకిస్తాన్‌లో ఆ ప్రాంతంలో ఓ వైపు కరోనా.. మరోవైపు ఆహార సంక్షోభం.. లక్షలాదిమంది మృతి చెందే అవకాశం

Surya Kala

Surya Kala |

Updated on: Jul 31, 2021 | 11:48 AM

Food Emergency: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ పై ప్రకృతి పగబట్టిందా అనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలను ఓ వైపు కరోనా వణికిస్తుంటే.. మరోవైపు ఆహార కొరత ఇబ్బంది..

Food Emergency: పాకిస్తాన్‌లో ఆ ప్రాంతంలో ఓ వైపు కరోనా.. మరోవైపు ఆహార సంక్షోభం.. లక్షలాదిమంది మృతి చెందే అవకాశం
Pakistan

Food Emergency: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ పై ప్రకృతి పగబట్టిందా అనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలను ఓ వైపు కరోనా వణికిస్తుంటే.. మరోవైపు ఆహార కొరత ఇబ్బంది పెడుతుంది. బలూచిస్తాన్ లో కరువు విలయతాండవం చేస్తోంది… మిడతల దండు, కరువు, వంటి అనేక విపత్తులు బలూచిస్తాన్ ను వణికిస్తున్నాయి. ఇక్కడ వర్షాలు కురవకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.

దీంతో ఆ ప్రాంతాల్లో నివస్తిస్తున్న సుమారు ఐదు లక్షల మందికి ఆహార కొరత ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆహార సంక్షోభం వలన లక్షాదిమందికి ఆహారం అందించాలని లేదంటే.. లక్షలాదిమంది మరణించే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ రిపోర్టు తెలిపింది. నీటి ఎద్దడితో తాగడానికి నీరు దొరకని పరిస్థితులు ఆందోళకరంగా మారింది. అక్కడ మనుషులకు, పశువులకు నీటి కొరత ఏర్పడింది.

పంటలు పండక పోవడంతో మనుషులకు తినడానికీ తిండి లేదు.. పశువులకు పశుగ్రాసం లేదు. దీంతో అక్కడ పశువులు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే ఈ ఏడాది చివరి వరకూ కరువు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరో ఐదు నెలల పాటు ఈ ప్రాంతం కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలకు జీవనోపాధి ప్రాజెక్టులకు ఐక్యరాజ్య సమితి, ప్రాదేశిక విపత్తు నిర్వహణ శాఖ అధికారులు మద్దతిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రజలకు అండగా నిలవడానికి ముందుకొస్తున్నారు.

Also Read: Viral News: నీటి చుక్కని బంగారంగా మార్చేసిన శాస్త్రజ్ఞులు.. త్వరలో నీటి కోసం కూడా కొట్టుకోవాలేమో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu