భారత్ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి.. ప్రపంచ దేశాల ముందు మోకరిల్లుతున్న పాకిస్థాన్!
సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడంతో నిస్సహాయ స్థితిలోకి జారుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికలపై లబోదిబోమంటోంది. మంగళవారం ఇస్లామాబాద్‌లో శాశ్వత చట్టపరమైన సింధు జలాల ఒప్పందం' అనే శీర్షికతో పాక్ ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ ఒప్పందం విఫలమైతే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాగితాలకే పరిమితమైన ఏ ప్రపంచ వ్యవస్థ కూడా సురక్షితంగా ఉండబోదంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాక్ భయపెట్టే ప్రయత్నం చేసింది.

సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడంతో నిస్సహాయ స్థితిలోకి జారుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికలపై లబోదిబోమంటోంది. మంగళవారం ఇస్లామాబాద్‌లో శాశ్వత చట్టపరమైన సింధు జలాల ఒప్పందం’ అనే శీర్షికతో పాక్ ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ ఒప్పందం విఫలమైతే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాగితాలకే పరిమితమైన ఏ ప్రపంచ వ్యవస్థ కూడా సురక్షితంగా ఉండబోదంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాక్ భయపెట్టే ప్రయత్నం చేసింది.
‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’
2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన ఉగ్రదాడి తర్వాత భారత్ అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాదానికి, జల ఒప్పందానికి ముడిపెడుతూ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనికి తోడు పశ్చిమ నదులపై భారత్ తన జలవిద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసింది.
ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్!
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో, నదుల్లోని నీటి పరిమాణానికి సంబంధించిన కీలకమైన జలసంబంధ సమాచారం పాక్‌కు అందడం లేదు. దీంతో తమ నదుల్లో ఎంత నీరు ఉందో తెలియక పాక్ కొట్టుమిట్టాడుతోంది. తన వాదనను బలోపేతం చేసుకోవడానికి పాక్ అకస్మాత్తుగా ఇస్లాం పూర్వ చరిత్రను తవ్వుతూ, ‘సింధు లోయ నాగరికత’ తమదేనంటూ ప్రచారం చేసుకుంటోంది.
పాక్ విదేశాంగ మంత్రి వార్నింగ్
ఈ సదస్సులో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఉమ్మడి జలాలను ఎన్నడూ ఆయుధాలుగా మార్చకూడదని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రాంతీయ శాంతికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మరోవైపు పాక్ సెనేటర్ ముసాదిక్ మాలిక్ భారత్ పేరు ఎత్తకుండా.. ఒక శక్తివంతమైన దేశం ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను నిలిపివేస్తే, వాటి విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించారు. చరిత్రలో ఇటువంటి ఏకపక్ష వైఖరులే జాతి నిర్మూలనకు దారితీశాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
It was a privilege to address the seminar, “Indus Waters Treaty: An Instrument of Regional Peace and Stability,” where leading experts from Pakistan and abroad discussed one of the defining challenges of our time in South Asia.
I underscored that the Indus Waters Treaty is not…
— Ishaq Dar (@MIshaqDar50) June 30, 2026
అయితే, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ పూర్తిగా స్వస్తి పలికి, నమ్మదగిన చర్యలు తీసుకునేంత వరకు ఈ ఒప్పందం పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ ఖరాఖండీగా చెప్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
