PakistanTrain Accident: ఘోర రైలు ప్రమాదం.. బోల్తా పడిన పది రైలు బోగీలు! వీడియో వైరల్

|

Aug 06, 2023 | 5:05 PM

రైలులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. క్షత గాత్రులను హుటాహుటీన సమీసంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

PakistanTrain Accident: ఘోర రైలు ప్రమాదం.. బోల్తా పడిన పది రైలు బోగీలు! వీడియో వైరల్
Pakistan Train Accident
Follow us on

లాహోర్, ఆగస్టు 6: పాకిస్థాన్‌లో ఆదివారం (ఆగస్టు 6) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. షాజాద్‌పూర్ – నవాబ్‌షా మధ్య సహారా రైల్వే స్టేషన్ సమీపంలో రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడగా, 20 మంది మరణించారు. రైలులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. క్షత గాత్రులను హుటాహుటీన సమీసంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు కరాచీ నుంచి పంజాబ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జైలు శిక్ష

తోషఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్‌లోని జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ మేరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అదనపు న్యాయమూర్తి హుమయూన్ దిలావర్ తీర్పు వెలవరించారు. లక్ష రూపాయల జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలలపాటు జైలు శిక్ష అనుభవించవల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఐదేళ్ల పాటు పాక్‌లో నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ఆయనపై అనర్హత వేటు వేసింది. జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు వెనువెంటనే అరెస్టు వారెంట్‌ కూడా జారీ చేసింది. దీంతో పోలీసులు లాహోర్‌లోని ఇమ్రాన్ ఖాన్‌ నివాసంలో అరెస్టు చేశారు. ఇక ఇమ్రాన్‌ తన అరెస్టుపై స్పందించారు. తన అరెస్టు ముందే ఊహించానని, ఇదంతా లండన్‌ ప్లాన్‌లో భాగమేనన్నారు. దీని అమలులో మరో ముందడుగు అని, దీనిపై పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో పాక్‌ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టాడు. ఈ మేరకు ముందుగానే రికార్డు చేసి పెట్టుకున్న తన ప్రసంగాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

తోషఖానా కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై కోర్టు అనర్హత వేటు వేయడంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు వీలులేదు. మరోవైపు ఆగస్టు 9న తమ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నట్లు పాక్​ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. అసెంబ్లీ రద్దు తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పోటీ చేస్తారని పీఎం షెహబాజ్‌ ఇప్పటికే ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.