AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nawaz Sharif షాబాజ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి పాకిస్తాన్ వచ్చేందుకు అనుమతి!

యూకేలో చికిత్స పొందుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి తన దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తాజాగా నవాజ్ షరీఫ్‌కు పాస్‌పోర్టు జారీ చేసింది షాబహజ్ ప్రభుత్వం.

Nawaz Sharif షాబాజ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి పాకిస్తాన్ వచ్చేందుకు అనుమతి!
Nawaz Sharif
Balaraju Goud
|

Updated on: Apr 26, 2022 | 5:58 PM

Share

Nawaz Sharif to Return Pakistan: యూకేలో చికిత్స పొందుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తిరిగి తన దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. పాకిస్థాన్‌కు మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 72 ఏళ్ల నవాజ్ షరీఫ్‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేక అవినీతి కేసులను మోపింది. దీంతో ఆయన వైద్య చికిత్స నిమిత్తం పాకిస్తాన్‌ నుంచి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం‌ బ్రిటన్‌తో తలదాచుకుంటున్నారు. అయితే, తాజాగా నవాజ్ షరీఫ్‌కు పాస్‌పోర్టు జారీ చేసింది. పాకిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం.

నవంబర్ 2019లో లాహోర్ హైకోర్టు నుండి అనుమతి పొందిన తరువాత, నవాజ్ షరీఫ్ చికిత్స కోసం లండన్ బయలుదేరారు. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు కూడా బెయిల్ మంజూరైంది. లాహోర్‌లోని అత్యంత భద్రత కలిగిన కోట్ లఖ్‌పత్ జైలులో అతను ఏడేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, తాజాగా అతని తమ్ముడు, షాబాజ్ షరీఫ్ నేతృత్వంలో పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. దీంతో పాకిస్తాన్ తిరిగి వచ్చేందుకు అతనికి పాస్‌పోర్ట్ జారీ చేసిందని స్థానిక వార్తాపత్రిక పేర్కొంది.

పాస్‌పోర్ట్ స్వభావం చాలా సరళంగా ఉంటుందని, తత్కాల్ కేటగిరీలో తయారు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PML N) అధినేత. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ గత వారం లండన్‌లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జర్దారీ పాక్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాజకీయాలు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాల్లో కలిసికట్టుగా పనిచేయాలని చర్చించుకున్నట్లు సమాచారం.

2019లో బ్రిటన్‌కు వెళ్లే ముందు పాకిస్తాన్‌కు తిరిగి వస్తానని షరీఫ్ వాగ్దానం చేశారు. అందులో నాలుగు వారాల్లో చట్టం, న్యాయ ప్రక్రియను ఎదుర్కొంటానని హామీ ఇచ్చారు. దీని తర్వాత వైద్యులు అతను ప్రయాణానికి సరిపోతారని నిర్ధారించారు. నవాజ్ షరీఫ్ చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయారు.

Read Also… Prashant Kishor: సోనియా ఆఫర్‌ను తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యేక వ్యూహంతోనే పీకే నిర్ణయం.. ఫ్యూచర్ ప్లాన్ ఇదే!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి