14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ.. తీవ్ర దుమారం రేపుతున్న ఘటన.. రంగంలోకి పోలీసులు
ఎంపీ 14 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. చట్టాలకు విరుద్దంగా 50 ఏళ్ల ఎంపీ మైనర్ బాలికను పెళ్లాడటం చర్చనీయాంశంగా ..
ఎంపీ 14 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. చట్టాలకు విరుద్దంగా 50 ఏళ్ల ఎంపీ మైనర్ బాలికను పెళ్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత, మౌలానా సలాహుద్దీన్ అయాబీ అనే 50 ఏళ్లున్న ఎంపీ 14 సంవత్సరాలున్నమైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. స్థానిక జుగూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదవుతున్న ఆ బాలిక 2006 అక్టోబర్ 28న జన్మించినట్లు రికార్డుల్లో నమోదైంది. దీని ప్రకారం మైనర్ బాలికను ఎంపీ ఎంపీ వివాహం చేసుకున్నట్లు స్థానిక మహిళా సంక్షేమ స్వచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ పోలీసులు బాలిక పెళ్లి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము ఈ వివాహం చేసుకోలేదని, తమకు పెళ్లితో ఎలాంటి సంబంధం లేదని బాలిక తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడం గమనార్హం. అయితే పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని వివాహం చేసుకుంటే అది చెల్లదని అన్నారు. అంతేకాదు ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తారు. మొత్తం మీద ఎంపీనే మైనర్ బాలికను పెళ్లాడటం పాక్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: Elon Musk : కోరి నష్టపోయే ఎలాన్ మస్క్.. ఒక్క ట్వీట్‌తో 1.10 లక్షల కోట్లు నష్టపోయిన ప్రపంచ కుబేరుడు