లాడెన్ వారసుడు హంజా మృతి: అమెరికా ఇంటిలిజెన్స్

అల్‌ఖైదా అగ్రనాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ మరణించినట్లు అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే హంజా ఎక్కడ మరణించాడు..? అతడిని ఎవరు చంపారు..? అనే విషయాలపై మాత్రం ఇంటిలిజెన్స్ అధికారులు స్పష్టతను ఇవ్వలేదు. అయితే ఒసామా బిన్ లాడెన్‌కు ఉన్న ముగ్గురు భార్యలు పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌ ఇంట్లో నివాసముంటుండగా.. ఇటీవల వారిపై దాడులు జరిపారు. ఆ దాడుల్లో హంజా కనిపించలేదు. కాగా లాడెన్ మరణానంతరం ఆయన వారసుడిగా బాధ్యతలు తీసుకున్న హంజా […]

లాడెన్ వారసుడు హంజా మృతి: అమెరికా ఇంటిలిజెన్స్
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 7:13 AM

అల్‌ఖైదా అగ్రనాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ మరణించినట్లు అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే హంజా ఎక్కడ మరణించాడు..? అతడిని ఎవరు చంపారు..? అనే విషయాలపై మాత్రం ఇంటిలిజెన్స్ అధికారులు స్పష్టతను ఇవ్వలేదు. అయితే ఒసామా బిన్ లాడెన్‌కు ఉన్న ముగ్గురు భార్యలు పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌ ఇంట్లో నివాసముంటుండగా.. ఇటీవల వారిపై దాడులు జరిపారు. ఆ దాడుల్లో హంజా కనిపించలేదు.

కాగా లాడెన్ మరణానంతరం ఆయన వారసుడిగా బాధ్యతలు తీసుకున్న హంజా అల్‌ ఖైదా చీఫ్‌గా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో గతంలో అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన హంజాను ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, ఆస్తులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అంతేకాదు అతడి తన మీద మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. ఇక హంజా చివరి సారిగా 2018లో మీడియాకు ఓ వీడియో విడుదల చేశాడు. అందులో సౌదీ అరేబియాను ఆయన బెదిరించాడు.