AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాడి చేద్దామని ప్లాన్ చేశాం.. కానీ.. భారత్ ముందే బ్రహ్మోస్‌ మిసైళ్లను ప్రయోగించింది.. పాక్‌ ప్రధాని ఏమన్నారంటే..

ఆపరేషన్‌ సింధూర్‌పై స్పందించాడు పాక్‌ ప్రధాని. భారత్‌ తమపై దాడి చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ముందు తామే దాడి చేయాలనుకున్నాం, కానీ ఆలోపే భారత్‌ బ్రహ్మోస్‌ మిసైళ్లను ప్రయోగించిందంటూ పేర్కొన్నారు.. రావల్పండి సహా అనేక కీలక ప్రాంతాల్లో భారత్‌ చేసిన దాడుల్లో తీవ్ర నష్టం జరిగిందన్నారు.

దాడి చేద్దామని ప్లాన్ చేశాం.. కానీ.. భారత్ ముందే బ్రహ్మోస్‌ మిసైళ్లను ప్రయోగించింది.. పాక్‌ ప్రధాని ఏమన్నారంటే..
Shahbaz Sharif
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2025 | 9:07 AM

Share

ఊపర్‌ షేర్వాణీ..అందర్‌ పరేషానీ.. ఆపరేషన్‌ సింధూర్‌తో భారత్‌ సత్తాను చవి చూసిన పాకిస్థాన్‌కు ఇంకా చెమటలు పడుతూనే ఉన్నాయి. ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నట్టుగా బారత్‌పై విషప్రచారానికి తెరలేపాడు పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌.. తోకలాగా ఆర్మీ చీఫ్‌ను మునీర్‌ వెంటేసేకుని వెళ్లి అజార్‌ బైజాన్‌లో మొసలికన్నీరు కార్చారు. భారత్‌ దౌత్యవ్యూహంతో ఇప్పటికే పాక్‌ అంతర్జాతీయంగా ఏకాకిగా మారింది. టర్కీ, అజర్‌ బైజాన్‌, ఇరాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతుగా నిలిచాయి. అజార్‌బైజాన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన షాబాద్‌.. భారత్‌ పై తామే ముందు దాడి చేద్దామనుకున్నామని.. కానీ తమ కన్నా ముందే భారత్‌ బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తో తమపై దాడి చేసిందన్నారు. నమాజ్ తర్వాత దాడి చేద్దామనుకుంటే.. భారత్ ముందే దాడి చేసిందన్నారు. రావల్పండి సహా అనేక కీలక ప్రాంతాల్లో భారత్‌ చేసిన దాడుల్లో తీవ్ర నష్టం జరిగిందన్నారు. కానీ భారత్‌ బాగా రాబడి పెరిగిందని, ఎన్నో ఆయుధాలను సమకూర్చకుందన్నారు.

భారత్‌ దాడుల గురించి తమ ఆర్మీ చీఫ్‌ ఆసీం మునీర్‌ తనకు చెప్పారన్నారు షాబాజ్‌. భారత్‌ దాడుల వల్ల పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరగడమే కాకుండా ఇరుదేశాల మధ్య ఘర్షణను మరింత పెంచిందన్నారు. భారత్‌ దాడి చేసిన టైమ్‌లో తమ దేశాన్ని కాపాడుకోవడం మినహా మరే మార్గంలేదన్నాడు. పోరు నష్టమన్న మునీర్‌ సలహా మేరకు తాను కాల్పుల విరమణకు అంగీకరించారని కలరింగ్‌ ఇచ్చాడాయన . అంతేకాదు చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు.. పహాల్గామ్‌ ఉగ్రదాడిపై ఇన్ని రోజుల తరువాత స్పందించాడు పాక్‌ ప్రధాని. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పేర్కొన్నారు.

పైన షర్వాణీ వేసుకున్నా లోపల బాగా పరేషాన్‌ అయినట్టుడున్నాడు మాటమాటకీ మునీర్‌ .. మునీర్‌ అంటూ ఆర్మీ ఛీప్‌ పేరును పలవరించాడు షాబాష్‌ షరీఫ్‌. అజార్‌బైజాన్‌లో ఆ ఇద్దరి వాలకం, గెలవలేక మద్దెల ఓడిందన్నట్టుగా ఉందనే కామెంట్లు హోరెత్తాయి. తామే ముందు దాడి చేయాలనుకుని చెప్పడం బకరా గాంభీర్యం. ఘర్షణలు పెరగకూడదని కాల్పుల విరమణకు అంగీకారించామని చెప్పడం మిలియనీయమ్‌ జోక్‌ అంటున్నారు నెట్‌జన్స్‌.

ఆర్థిక సంక్షోభంతో పాక్‌ పీకల్లోతు కష్టాల్లో వుంది. నాలుగు రాళ్లు వస్తాయనే ఆశతో విదేశాల బాటపట్టారు పాక్‌ ప్రధాని షాబాజ్‌, ఆర్మీ చీఫ్‌ మునీర్‌. ఆర్ధిక సాయం కోసం పాకులాటతో పాటు భారత్‌ అంటే ఎంత భయం వుందో పాక్‌ ప్రధాని మాటల్లో స్పష్టమైందని, పేరులో తప్ప ఆయన తీరు షరీఫ్‌లా లేదనే చర్చ నడుస్తోంది పబ్లిక్‌ డొమైన్‌లో. సింపుల్‌గా చెప్పాలంటే పాక్‌ ప్రధాని తంటాలన్నీ బీక్‌ మాంగ్నే కే లీయే అని అర్ధమవుతోందనేది మరో చర్చ.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..