Europe Airport: విమానాలను పక్షుల నుంచి రక్షించుకోవడానికి పందులకు ఉద్యోగం ఇచ్చిన అధికారులు ఎక్కడంటే..
Europe Airport: ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిఫోల్ విమానాశ్రయం యూరోప్ లో మూడవ అతిపెద్ద విమానాశ్రయం. అంతేకాదు సేవల పరంగా అనేక ప్రత్యేకతను కలిగి ఉంది. ప్యాసింజర్స్,..
Europe Airport: ఆమ్‌స్టర్‌డామ్‌లోని స్కిఫోల్ విమానాశ్రయం యూరోప్ లో మూడవ అతిపెద్ద విమానాశ్రయం. అంతేకాదు సేవల పరంగా అనేక ప్రత్యేకతను కలిగి ఉంది. ప్యాసింజర్స్, సర్వీసుల దృష్ట్యా ఎయిర్‌పోర్టు మూడో అతిపెద్దది. ఎయిర్ కార్గో ఫెసిలిటీతో ఉన్న మేజర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ కూడా. అయితే ఇప్పుడు ఈ ఎయిర్ఈ పోర్ట్ ఒక వింత సమస్యను ఎదుర్కొంటుంది. అంతేకాదు ఆ సమస్యను ఎదుర్కోవడానికి పందులకు ఎయిర్ పోర్ట్ అధికారులు ఉద్యోగం కూడా ఇచ్చారు. మరి విమానాశ్రయంలోని వింత సమస్య ఏమిటి.. పందులు ఏమి చేస్తున్నాయో తెలుసుకుందాం..
యూరోపియన్ దేశంలో ఒకటైన నెదర్లాండ్స్ లోని ప్రధాన అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో చుట్టు పక్కల భూమి 10.3 చదరపు మైళ్లు నీటితో తరచుగా నిండిపోతుంది. దీంతో అక్కడ వ్యవసాయానికి అనుకూలమైన భూమిగా మారిపోయింది. ఇక ఆహారం కోసం పక్షులు, జంతువులు రావడం మొదలు పెట్టాయి. అయితే ఈ ప్రాంతంలో పంటలు ఊహించిన దానికంటే ఎక్కువ పక్షులను ఆకర్షించాయి. దీంతో భారీ సంఖ్యలో పక్షులు రావడంమొదలు పెట్టాయి. దీంతో అక్కడ రన్ వే ల మీద కూడా పక్షులు, బాతులు రావడం మొదలు పెట్టడంతో.. ఎయిర్ పోర్ట్ కు వచ్చి పోయే విమానాలకు ఇబ్బందిలు మొదలయ్యాయి.
రన్ వే మధ్యలో బాతుల గుంపు భారీ సంఖ్యలో కదులుతూ రాకపోకలకు జాప్యం కలిగిస్తున్నాయి. దీంతో ఏవియేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఎయిర్ పోర్ట్ భూముల్లోని పందుల గుంపు వచ్చింది. ఓ ఇరవై పందుల టీంను ఆమ్‌స్టర్‌డమ్ స్కిఫోల్ ఎయిర్‌పోర్టు రిక్రూట్ చేసుకుంది. దీంతో ఈ పందులు ఆరు రన్‌వేల్లో బాతులు రాకుండా కాపలాకాస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ విమానాలకు ఉన్న రిస్క్ తగ్గిపోయింది. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న 500ఎకరాల చెరకుతోటల్లో పందులను విడిచి పెట్టారు.. బాతులు రాకుండా పందులు చేశాయి. ఎలా అంటే.. పందులను పంట చేలల్లో వదిలిన కొన్ని గంటల్లోనే మొత్తం పంటను తినేశాయి. ఇక బాతులు తినడానికి ఏమీ మిగలకపోవడంతో.. పక్షులు బాతులు అటువైపు చూడడం లేదని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు.