చాలా కాలం తర్వాత కనిపించాడు.. సన్నబడ్డాడు.. హెయిర్ స్టైల్ మార్చాడు.. గుర్తు పట్టండి చూద్దాం..
Kim Jong: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ చాలా కాలం తర్వాత సైనిక కవాతులో మరోసారి కనిపించాడు. ఈ సమయంలో కిమ్ బరువు చాలా తగ్గిన తక్కువగా ఉన్నట్లు...
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ చాలా కాలం తర్వాత సైనిక కవాతులో మరోసారి కనిపించాడు. ఈ సమయంలో కిమ్ బరువు చాలా తగ్గిన తక్కువగా ఉన్నట్లు కనిపించాడం అందరిని ఆశ్చర్య పరిచింది. జాతీయ టెలివిజన్‌లో కవాతు సందర్భంగా కిమ్ కనిపించాడు. ఈ సమయంలో కిమ్ చాలా సన్నగా కనిపించాడు. అతని తాత ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ లాగా హెయిర్ స్టైల్ మార్చాడు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తర్వాత ఉత్తర కొరియాలో జరుగుతున్న తొలి సైనిక కవాతు ఇది.
ఈసారి సైనిక కవాతులో పెద్ద కొత్త ఆయుధాలు కనిపించలేదు. ఈ కవాతును గురువారం ప్రత్యేక్ష ప్రసారం చేసింది అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థ. అయితే, అందరి దృష్టిని కిమ్ జాంగ్ ఆకర్శించాడు. ఎందుకంటే చాలా సన్నబడి కనిపించాడు దీని వెనుక కారణం గత కొన్ని నెలలుగా కిమ్ చాలా బరువు తగ్గి… లేత రంగు సూట్ ధరించి.. సైనిక కవాతు చూడటానికి వచ్చాడు. అయితే మరో వింత ఇక్కడ చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కిమ్ ఎలాంటి ప్రసంగం చేయలేదు. కానీ ప్రజలను చూస్తూ నవ్వుతూ కనిపించాడు. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని సెంట్రల్ కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ ముందు భద్రతా దళాలు గంటకు పైగా కవాతు చేశాయి.
కిమ్ 20 కిలోలు తగ్గాడు
కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం గురించి చాలా సంవత్సరాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కారణం అధిక బరువు తగ్గడంతోపాటు కిమ్ ధూమపానం మానేసినట్లుగా ప్రచారం సాగింది. కిమ్ కుటుంబ సభ్యులకు గుండె సంబంధితమైన సమస్యతో పోరాడుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా చాలా సార్లు వార్తలు రాసింది. ఇందే సమయంలో కొంత కాలం కిమ్ కనిపించకుండా పోవడం పెద్ద చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..
Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..