Afterlife Pay: పిజ్జా కంపెనీ వెరైటీ ఆఫర్‌.. ‘హాయిగా తినండి.. చనిపోయిన తర్వాత బిల్లు కట్టండి’

రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు తిన్న తర్వాత బిల్లు కట్టిన తర్వాతే బయటికి వెళ్లడం ఆనవాయితీ. సాధారణంగా ఏ దేశంలోనైనా ఇలాగే ఉంటుంది. ఐతే పిజ్జా కంపెనీ మాత్రం 'ఇప్పుడు తినండి.. చనిపోయిన తర్వత బిల్లు కట్టండి' అంటూ వింత ఆఫర్‌..

Afterlife Pay: పిజ్జా కంపెనీ వెరైటీ ఆఫర్‌.. 'హాయిగా తినండి.. చనిపోయిన తర్వాత బిల్లు కట్టండి'
New Zealand Pizza Chain Offer
Follow us

|

Updated on: May 29, 2023 | 7:37 AM

రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు తిన్న తర్వాత బిల్లు కట్టిన తర్వాతే బయటికి వెళ్లడం ఆనవాయితీ. సాధారణంగా ఏ దేశంలోనైనా ఇలాగే ఉంటుంది. ఐతే పిజ్జా కంపెనీ మాత్రం ‘ఇప్పుడు తినండి.. చనిపోయిన తర్వత బిల్లు కట్టండి’ అంటూ వింత ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో కస్టమర్లతోపాటు పోలీసులు కూడా సదరు కంపెనీపై ఓ కన్ను వేసి అనుమానిస్తున్నారు

న్యూజిలాండ్‌కు చెందిన హెల్‌ పిజ్జా అనే అనే ఓ పిజ్జా కంపెనీ ఈ వినూత్న ఆఫర్‌ను తీసుకొచ్చింది. తమ హోటల్‌కు వచ్చిన కస్టమర్లు హాయిగా పిజ్జా తిని చనిపోయిన తర్వాత దాని బిల్లు చెల్లించవచ్చని చెబుతోంది. ఇందుకోసం ‘ఆఫ్టర్‌ లైఫ్‌ పే (After Life Pay)’ పేరుతో కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఐతే ఈ ఆఫర్‌ను కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే అందించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం యూజర్లు తమ వివరాలను కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంపెనీ రూపొందించిన వీలునామా పత్రాలపై యూజర్లు సంతకం చేయాలి. ఆఫర్‌ పొందిన వినియోగదారుడు చనిపోయిన తర్వాత వీలునామా ఆధారంగా వారి బ్యాంకు ఖాతాలు లేదా కుటుంబసభ్యుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఈ ఆఫర్‌ పొందాలంటే..18 ఏళ్లు నిండిన యూజర్లు తమ వివరాలను కంపెనీకి మెయిల్‌ చేయాలి. అందులోంచి ఎంపిక చేసిన 666 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ వెనుక ఎలాంటి మోసం లేదని హెల్‌ పిజ్జా సీఈవో బెన్‌ క్యూమింగ్‌ అంటున్నా.. న్యూజిలాండ్ వినియోగదారుల పరిరక్షణ ఫోరమ్‌ అధికారులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కారణం లేకపోలేదు. న్యూజిలాండ్‌లో ‘బై నౌ పే లేటర్‌’ విధానం ద్వారా కొన్ని కంపెనీల మార్కెటింగ్ మోసాలను గుర్తించలేని ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. పిజ్జా కోసం ఇలాంటి ఆఫర్లను ఉపయోగించుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.  ఏదిఏమైనా ఈ మధ్యకాలంలో ఏది మోసమో.. ఏది నిజమో.. తెలియక కేటుగాళ్ల చేతిలో అమాయక ప్రజలు సులువుగా మోసపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.