Viral: ‘ఇలాంటి భార్యలుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే’.. ఒక్కరోజులో రూ. 73 లక్షలు షాపింగ్ చేసిందట!
'భార్యలతో షాపింగ్‌కి వెళ్లడం కంటే.. మరో బుద్ది తక్కువ పని మరేం ఉండదు'.. ఇది చాలామంది భర్తల మాట. ఎందుకంటే ఆ సమయంలో డబ్బులు నీళ్లలా ఖర్చు అయిపోతాయి.
‘భార్యలతో షాపింగ్‌కి వెళ్లడం కంటే.. మరో బుద్ది తక్కువ పని మరేం ఉండదు’.. ఇది చాలామంది భర్తల మాట. ఎందుకంటే ఆ సమయంలో డబ్బులు నీళ్లలా ఖర్చు అయిపోతాయి. సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్ అంటే మహా ఇష్టం. ఏది కనిపించినా కొనేస్తారంతే.. అందుకే భార్యలతో షాపింగ్‌కు వెళ్లాలంటే భర్తలకు చాలా భయం. అయితే ఇక్కడ మేము ఓ ఇల్లాలి షాపింగ్ గురించి చెప్పబోతున్నాం. ఆమె రోజుకు ఎంత షాపింగ్ చేస్తుందో తెలిస్తే.. మీరు షాక్ అవ్వడం ఖాయం.
దుబాయ్‌కి చెందిన సౌదీయా.. అదే దేశానికి చెందిన జమాల్ అనే వ్యక్తిని వివాహమాడింది. వీరిద్దరి పరిచయం తొలిసారి దుబాయ్ యూనివర్సిటీలో జరగ్గా.. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల తర్వాత ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. జమాల్ చాలా రిచ్ పర్సన్. దీంతో సౌదీయాకు ఎలాంటి లోటు లేకపోయింది. వివాహం అనంతరం ఆమె ఏం కావాలన్నా దొరుకుతోంది. ఇక దానికి సంబంధించిన లగ్జరీయస్ లైఫ్‌ను ఆమె నెటిజన్లతో పంచుకుంది.
‘నా భర్త మూడ్ బట్టి రోజుకు రూ. 3.66 లక్షల నుంచి రూ. 73 లక్షల వరకు షాపింగ్ చేస్తుంటాం. మా ఇద్దరికీ ఫేవరెట్ స్పాట్ మాల్దీవులు. ఇక లండన్‌కి అయితే తరచూ వెళ్తుంటాం. మొన్నే షీసెల్స్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాం. నెక్స్ట్ టూర్ జపాన్. నా హబ్బీ అయితే నాకు రోజు కాస్ట్లీ గిఫ్ట్ తెస్తాడు. ఇటీవలే రెండు ఖరీదైన కార్లు కొనిచ్చాడు. ఒకవేళ బయట రెస్టారెంట్‌కు వెళ్తే.. రూ. 1.10 లక్షలు ఖర్చు అవుతాయి’ అని సౌదీయా తన లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక చివరిగా ‘ఐ యామ్ రిచ్ దుబాయ్ హౌజ్‌వైఫ్, భర్త సంపాదన ఖర్చుపెట్టడమే నా హాబీ’ అని రాసుకొచ్చింది. కాగా, దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.