Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 72 మంది మృతి.. ఇందులో నలుగురు భారతీయులు

నేపాల్‌లోని పోఖారాలో ఈరోజు ఓ విమానం కుప్పకూలింది. విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 72 మంది చనిపోయినట్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 72 మంది మృతి.. ఇందులో నలుగురు భారతీయులు
Nepal Plane Crash
Follow us

|

Updated on: Jan 15, 2023 | 3:32 PM

నేపాల్‌లోని పోఖారాలో జరిగిన ప్రమాదంలో బాధితులైన యతి ఎయిర్‌లైన్స్ విమానంలో కనీసం 5 మంది భారతీయ ప్రయాణీకులు కూడా ఉన్నారు. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మందితో వెళ్తున్న విమానం పోఖారా విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో  మొత్తం 72 మంది చనిపోయినట్లుగా ప్రకటించింది నేపాల్ ప్రభుత్వం నిర్ధారించబడింది. విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయుల గురించి టీవీ 9 సమాచారం సేకరించింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల పేర్లు సంజయ్ జైస్వాల్, సోనూ జైస్వాల్, అనిల్ కుమార్ రాజ్‌భర్, అభిషేక్ కుష్వాహా, విశాల్ శర్మ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ టీవీ 9 న్యూస్‌కు తెలిపింది.

ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం నేపాల్ అడ్మినిస్ట్రేషన్, యెతి ఎయిర్‌లైన్స్‌తో కూడా టచ్‌లో ఉంది.

విమాన ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇలా..

దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న విమానం ల్యాండింగ్‌ సమయంలో విమానం క్రాష్‌ అయ్యింది. ప్రమాదం జరిగిన -విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు యెతీ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. నలుగురు రష్యా పౌరులు కూడా ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదానికి ముందు విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు కేవలం 10 సెకన్ల ముందు ప్లేన్‌ క్రాష్‌ అయ్యింది.

ఈ విమానం ఇళ్లపై కూలుతుందని అందరూ భయపడ్డారు. కాని కొండను ఢీకొట్టి ఎయిర్‌పోర్ట్‌ సమీపం లోనే కుప్పకూలింది. ఈ విమానంలో 53 మంది నేపాల్‌ పౌరులు , 15 మంది విదేశీయులు ప్రయానం చేశారు.

పోకారా ఎయిర్‌పోర్టులో దిగుతుండగా విమానం కుప్పకూలింది. కొత్త ఎయిర్‌పోర్టు, పాత ఎయిర్‌ పోర్టు మధ్యలో నదిలో విమానం కుప్పకూలింది. ల్యాండింగ్‌ టైమ్‌లో విమానంలో మంటలు చెలరేగాయి

ఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని ప్రచండ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ల్యాండింగ్‌ కంటే ముందు విమానంలో మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. యెతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9N-ANC ATR-72 విమానం ఖాట్మాండు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉదయం 10.33 గంటలకు బయలుదేరింది. తరువాత కుప్పకూలింది. పొకారా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో కొండను ఢీకొట్టి ఈ విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది.

యెతీ ఎయిర్‌లైన్స్‌ను నేపాల్‌లో 12 రోజుల క్రితమే ప్రారంభించారు. ప్రమాదానికి గురైన విమానం చైనాలో తయారైనట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పొకారా పెద్ద టూరిస్ట్‌ కేంద్రం. సేతీ నది పక్కనే ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు