Miss Universe 2022: విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. 16వ ప్లేస్‌లో ఇండియన్ బ్యూటీ దివితా రాయ్..

మిస్ యూనివర్శ్ 2022 కిరీటాన్ని అమెరికాకు చెందిన బోనీ గ్యాబ్రియెల్ దక్కించుకుది. ఇండియాకి చెందిన 2021 విశ్వ సుందరి హర్నాజ్ సంధు.. ఆమెకు కిరీటాన్ని బహుకరించింది.

Miss Universe 2022: విశ్వసుందరిగా అమెరికా అందగత్తె.. 16వ ప్లేస్‌లో ఇండియన్ బ్యూటీ దివితా రాయ్..
Untitled 4
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 15, 2023 | 12:26 PM

మిస్ యూనివర్శ్ 2022 కిరీటాన్ని అమెరికాకు చెందిన బోనీ గ్యాబ్రియెల్ దక్కించుకుది. ఇండియాకి చెందిన 2021 విశ్వ సుందరి హర్నాజ్ సంధు.. ఆమెకు కిరీటాన్ని బహుకరించింది. అమెరికాలోని లూసియానాలో 71వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌-2022 గ్రాండ్‌ ఫినాలే అంగరంగవైభవంగా జరిగింది. మొత్తం 80 దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్‌ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. భారత్‌కు చెందిన పంజాబీ సుందరి, మిస్‌ యూనివర్స్‌-2021 హర్నాజ్‌ సంధు.. బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది.

వెనెజులా భామ అమండా దుడామెల్‌ మొదటి రన్నరప్‌గా, డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన అండ్రీనా మార్టినెజ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక భారత్‌ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివితా రాయ్‌ ఈసారి విశ్వసుందరి పోటీల్లో పాల్గొంది. అయితే 80 దేశాల అందగత్తెలతో పోటీపడ్డ దివిత 16వ స్థానానికి పరిమితమైంది.

ఇవి కూడా చదవండి

మిస్ యూనివర్స్ కాంటెస్ట్..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..