Zoleka Mandela: నల్ల జాతి సూరీడు నెల్సన్ మండేలా మనవరాలు కన్నుమూత.. కంటతడి పెట్టిస్తోన్న చివరి ఇన్‌స్టా పోస్ట్!
దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష, జాత్యహంకారం కోసం పోరాడి ఆదేశ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా (43) కన్నుమూశారు. ప్రముఖ రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా మండేలా గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి సెప్టెంబర్ 25 (సోమవారం) జొలేకా మరణించినట్లు కుటుంబ సభ్యులు ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. క్యాన్సర్ చికిత్స కోసం ఈ నెల 18న జొలేకా మండేలా ఆసుపత్రిలో..

దక్షిణాఫ్రికా, సెప్టెంబర్ 27: దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష, జాత్యహంకారం కోసం పోరాడి ఆదేశ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైన నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా (43) కన్నుమూశారు. ప్రముఖ రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా మండేలా గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి సెప్టెంబర్ 25 (సోమవారం) జొలేకా మరణించినట్లు కుటుంబ సభ్యులు ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు.
క్యాన్సర్ చికిత్స కోసం ఈ నెల 18న జొలేకా మండేలా ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులతో పాటు ఆమె శరీరంలోని కాలేయం, మెదడు, వెన్నుపాము వంటి ఇతర ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయి. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూశారు. ఇన్ని రోజులు ఆమెను జాగ్రత్తగా చూసుకున్న వైద్య బృందానికి ధన్యవాదాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో పేర్కొన్నారు.
View this post on Instagram
కాగా జోలేకా మండేలా 1980లో జన్మించారు. తన జీవితకాలమంతా రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, ఉదమ్యకారిణిగా పనిచేశారు. నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా రెండో భార్య కుమార్తె విన్నీ మండేలా మనవరాలు జొలేకా. జొలేకా మండలాకు నలుగురు పిల్లలున్నారు. తనకు క్యాన్సర్ సోకడంతో దానికి సంబంధించిన చికిత్సపై ఇటీవల ఓ డాక్యుమెంట్ చేశారు. ఇందులో తన చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వైధింపులు, డ్రగ్స్ అలవాటు తదితర అంశాలపై బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఆమెకు 32 ఏళ్ల వయసులో క్యాన్సర్ సోకింది. మాస్టెక్టమీ చికిత్స చేయించుకున్నారు. అనంతం 2016లో మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టింది. అయితే ఈ సారి ఆమెను బ్రతికించడం ఎవరి వల్ల కాలేదు. 2022లో జోలేకా తన మరణం గురించి ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. అందులో నా పిల్లలకు నేనేం చెప్పను? ఈ సారి నేను నా జీవితాన్ని కాపాడలేకపోతున్నాను. నేను లేకపోయినా అంతా సవ్వంగానే ఉంటుందని వారికి ఎలా చెప్పను. నేను చనిపోతున్నాను. కానీ నాకు అప్పుడే చనిపోవాలని లేదని తన వేదనను పంచుకున్నారు.
View this post on Instagram
జొలెకా మండేలా మరణం పట్ల నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు నెల్సన్ మండేలా ఫౌండేషన్ మంగళవారం ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




