AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎక్కడ నుంచి వచ్చార్రా మీరంతా.. నిమిషాల్లోనే కోట్లకు కోట్లు దోచేశారు.. ఇదిగో వీడియో

ఇటలీలో నడిరోడ్డు మీద దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే కోట్ల విలువైన యూరోలను తీసుకెళ్తున్న క్యాష్‌ వ్యాన్‌ను లూటీ చేశారు. సినీ ఫక్కీలో .. హాలీవుడ్‌ సినిమా సీన్‌ను తలపించే రీతిలో ఈ దోపిడీ జరిగింది. వ్యాన్‌ వెనుక భాగంలో మిలటరీ ఉపయోగించే పేలుడు పదార్ధాలను ఉపయోగించి దోపిడీ చేశారు.

Viral Video: ఎక్కడ నుంచి వచ్చార్రా మీరంతా.. నిమిషాల్లోనే కోట్లకు కోట్లు దోచేశారు.. ఇదిగో వీడియో
Money Heist Style Robbery In Italy
Shaik Madar Saheb
|

Updated on: Feb 10, 2026 | 8:18 PM

Share

ఇటలీలో నడిరోడ్డు మీద దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే కోట్ల విలువైన యూరోలను తీసుకెళ్తున్న క్యాష్‌ వ్యాన్‌ను లూటీ చేశారు. సినీ ఫక్కీలో .. హాలీవుడ్‌ సినిమా సీన్‌ను తలపించే రీతిలో ఈ దోపిడీ జరిగింది. వ్యాన్‌ వెనుక భాగంలో మిలటరీ ఉపయోగించే పేలుడు పదార్ధాలను ఉపయోగించి దోపిడీ చేశారు. అంతేకాకుండా డ్రైవర్‌ను సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు.

దోపిడీ వెనుక ఇంటర్నేషన్‌ గ్యాంగ్‌ హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. పగటి వేళ హైవేపై ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వ్యాన్ వెనుక భాగంలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను పేల్చుతూ డ్రైవర్‌, సిబ్బందిని బెదిరించిన దుండగులు.. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే కోట్లాది యూరోల నగదును చోరీ చేసినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ పేలుళ్లు, దుండగుల దాడి, రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు ఇవన్నీ కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ సీన్‌లా కనిపిస్తున్నాయి. చోరీ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇది అంతర్జాతీయ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఇటలీ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హాలీవుడ్‌ సినిమాను తలపించేలా భారీ దోపిడీ.. నిమిషాల్లోనే
హాలీవుడ్‌ సినిమాను తలపించేలా భారీ దోపిడీ.. నిమిషాల్లోనే
ఇక ఎక్కడా ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు!
ఇక ఎక్కడా ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..