ఓరీ దేవుడో ఇది నది కాదు నరకం.. పొరపాటున అటుగా వెళ్లారంటే మీ పని ఖతమే..! ఎక్కడంటే..
మనదేశంలో నదులను దైవంగా భావిస్తారు. నదీమా తల్లిగా పూజిస్తారు. కానీ, ఈ భూమిపై నరకం కంటే దారుణమైన నది ఒకటి ఉంది.. దాని గురించి తెలిస్తే నది దరి దాపులకు వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే.. ఈ నది ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త కుప్పవంటిది. ఈ నదిలో కంటికి కనిపించేంత వరకు చెత్త తప్ప మరేమీ కనిపించదు. అలాంటి భయంకర నది ఎక్కడ ఉందో తెలుసా..? ఎందుకు ఆ నది నరకంలా మారిందో ఇక్కడ చూద్దాం...

ప్రకృతి ఒడిలో ప్రవహించే ఒక నది ప్రస్తుతం స్వర్గంలా కాకుండా పర్యావరణ విపత్తు సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది. తూర్పు బోస్నియా నగరమైన వైసెగ్రాడ్ సమీపంలో ప్రవహిస్తున్న ఒక నది ఉపరితలం ఇప్పుడు నీటితో కాకుండా ప్లాస్టిక్ సీసాలు, పాత ఫర్నిచర్, తుప్పుపట్టిన బారెల్స్, చనిపోయిన జంతువులతో నిండిపోయి ఉంది. భారీ వర్షాలు, వరదలు పొరుగు దేశాల నుండి చెత్తను కొట్టుకు రాగా, నదిపై చెత్త డంప్‌తో భారీ ద్వీపాలను సృష్టించాయి. ఐరోపాలోని బోస్నియా దేశంలో డ్రినా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరుకుపోయాయి. అక్కడి ప్రభుత్వం నియంత్రణ లోపంతో రెండు దశాబ్దాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలోకి చేరుతున్నాయి. ఇప్పుడు డ్రినా నది పరిస్థితి చెత్త డంప్ కంటే తక్కువ కాదు. ఇక్కడ పది వేల క్యూబిక్ మీటర్ల చెత్త ఉందని సమాచారం.
బోస్నియా-హెర్జెగోవినాలోని విసెగ్రాడ్ నగరం గుండా ప్రవహించే డ్రినా నది చెత్త కుప్పగా మారింది. నివాసితులు, పర్యాటకులు తమ వ్యర్థాలన్నింటినీ నదిలో వేస్తారు. ఏళ్ల తరబడి ఇక్కడ పెద్ద మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. నీటిపై గుర్రపు డెక్క పరుచుకున్నట్లు ప్లాస్టిక్ వస్తువులు పరుచుకున్నాయి. శీతాకాలం, వర్షాకాలంలో పరిమాణం ఈ చెత్త పెరుగుతుంది. పరిస్థితి అదుపు తప్పడంతో బోస్నియన్ జలవిద్యుత్ కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోటకు చేర్చి తీసివేయడానికి ఏర్పాట్లు చేసింది. శుభ్రపరిచినప్పటికీ చెత్త ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో విసెగ్రాడ్ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
1990ల వరకు కొనసాగిన సుదీర్ఘ యుద్ధం తర్వాత యుగోస్లేవియా విడిపోయింది. కానీ బోస్నియా, హెర్జెగోవినా అభివృద్ధి పరంగా ఇతర యూరోపియన్ దేశాల కంటే వెనుకబడి ఉన్నాయి. వ్యర్థాల తొలగింపుకు సరైన శుద్ధి కర్మాగారాలను అందించడంలో ఆ దేశం విఫలమైంది. ఇక్కడ ప్రజలు చెత్తను ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి చెట్ల కొమ్మలకు వేలాడదీస్తారు. అవి జంతువుల దాడి,రియు వాతావరణం కారణంగా చిరిగి నదిలో పడతాయి. ఈ వ్యర్థాలు నదులలోకి ప్రవహించి వర్షాల సమయంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




