Mask Innovation Challenge: మీలో సృజనాత్మక ఉందా..! అయితే మాస్కు తయారు చేయండి.. 3. కోట్లు గెలుచుకోండి..

Mask Innovation Challenge: ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా ముందు.. కరోనా తర్వాత అన్న చందంగా మారిపోయింది. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని...

  • Surya Kala
  • Publish Date - 7:01 am, Wed, 7 April 21
Mask Innovation Challenge: మీలో సృజనాత్మక ఉందా..! అయితే మాస్కు తయారు చేయండి.. 3. కోట్లు గెలుచుకోండి..
Mask Innovation Challenge

Mask Innovation Challenge: ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా ముందు.. కరోనా తర్వాత అన్న చందంగా మారిపోయింది. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నా… ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఇక కోవిడ్ నివారణకు చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి ఒక్కరూ మాస్క్ ను ధరిస్తున్నారు. అయితే ఇవి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తూ.. ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో కరోనా కు మాస్క్ తప్పనిసరని తెలిసినా కొంతమంది మాస్కులు పెట్టుకోవడం లేదు. ఒకవేళ మాస్కులు ధరించిన అవి గడ్డం కిందనే ఉంటుంన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీ వినూత్న ప్రయత్నం చేస్తోంది. సులభంగా వాడగలిగే, సౌకర్యవంతమైన మాస్కును తయారు చేస్తే కోట్లలో బహుమతి ఇస్తామని ప్రకటించారు మాస్క్ ఇన్నోవేషన్ చాలెంజ్ సంస్థ అధికారులు. ఈ పోటీని అమెరికా ప్రభుత్వానికి చెందిన బయో మెడికల్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీతో కలిసి ఈ పోటీ నిర్వహిస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

ఈ మాస్క్ తయారీకి కొన్ని సూచనలు కూడా ఇచ్చింది. ఎవరైనా మాస్క్ తయారు చేస్తే.. ఆ మాస్క్ ఎలా ఉండాలంటే.. అది ధరించడానికి ఓ రేంజ్ లో పోటీ ఉండాలట. ఇప్పుడు ధరిస్తున్న మాస్కులు కొన్ని అసౌకర్యాలు కలుగజేస్తుంది. శ్వాస వదులుతున్న సమయంలో ఆవిరి కళ్లజోడుపై చేరుకొని.. మసగబారుతున్నాయి. ఇది అమెరికా వాతావరణానికి చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. అందుకనే అక్కడ మాస్క్ ధరించడానికి చాలా మందిలో వ్యతిరేకత నెలకొంది. ఇంకా చెప్పాలంటే అక్కడ నో మాస్క్ ఉద్యమం కూడా అక్కడ నడుస్తోంది. దీంతో అమెరికాలో వ్యాధుల నియంత్రణ సంస్థ… CDCకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే సంస్థ భాగస్వామ్యంతో BARDA ఈ మాస్క్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ విసిరింది.

ఈ మాస్కుల తయారీ పోటీకి రెండు దశలు ఉన్నాయి. మొదటి దశలో మాస్క్ డిజైన్‌పై దృష్టి పెడతారు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడున్న మాస్కుల్లోనే మార్పులు చేసి తయారు చేయడం ఒక పద్ధతైతే… పూర్తిగా సరికొత్త టెక్నాలజీ, సరికొత్త ఉత్పత్తులతో కొత్త డిజైన్ మాస్క్ చేయడం మరో పద్ధతి. ఈ దశలో విజేతలుగా 10మందిని ఎంపిక చేస్తారు. అలా విజేతలుగా నిలిచిన పదిమందిలో ఒక్కొక్కరికీ 10వేల డాలర్లు (రూ.7,33,300) ఇస్తారు. ఈ డబ్బులను మాస్క్ ల తయారీకి ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇక రెండో దశకు చేరుకున్న ఈ పది మంది కంటెస్టెంట్లు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో పాల్గొంటారు. అంటే తాము తయారు చేసే మాస్క్ గురించి దాని ఉపయోగాల గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పది మంది తాము చెయ్యాలనుకుంటున్న సరికొత్త మాస్కుల డిజైన్‌ను ఊహాజనితంగా చెప్పాలి. పోటీదారుడు తమ ఊహాజనిత సరికొత్త మాస్క్ ను తయారుచేసి… టెస్టింగ్ కోసం NIOSHకి అందించవచ్చు కూడా.. ఈ దశలో విజేతలుగా 5 మందిని ఎంపిక చేస్తారు. ఈ ఐదుగురి విజేతలకు రూ.2,93,32,000 బహుమతిగా ఇస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని మళ్లీ త్వరలో ప్రకటించనున్నారు.

అయితే ఈ మాస్క్ లు పేద, ధనిక అనే తేడాలేకుండా అందరికీ నచ్చేలా రూపొందించాలి. రోజూ పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉండాలి. కరోనా ను నిరోధించేలా ఉండాలి.. ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలి.. ఇంకా చెప్పాలంటే..కరోనా తగ్గిన తర్వాత కూడా ఆ మాస్క్ ను వాడడానికి ప్రజలు ఇష్టపడాలి ఇన్ని ప్రయోజనాలున్న మాస్క్ తయారు చేయడం కోసమే 3.6కోట్ల భారీ మొత్తంలో బహుమతిని ఇవ్వడానికి రెడీ అయ్యారు. అన్ని ప్రయోజనాలూ కల్పించే మాస్క్ తయారీకి మొదటి దశ పోటీకి ఏప్రిల్ 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా. ఉద్యోగపరంగా శుభఫలితాలు పొందడం కోసం ఏం చేయాలంటే..!

 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు.. రక్తం గడ్డకట్టడానికి ఏదో సంబంధముంది.. ఈఎమ్ఏ వెల్లడి