AstraZeneca Vaccine: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు.. రక్తం గడ్డకట్టడానికి ఏదో సంబంధముంది.. ఈఎమ్ఏ వెల్లడి
AstraZeneca-Oxford COVID-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఉధృతి భారీగా పెరుగుతోంది. ఓవైపు కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ
AstraZeneca-Oxford COVID-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ఉధృతి భారీగా పెరుగుతోంది. ఓవైపు కేసులు సంఖ్య నానాటికీ పెరుగుతుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకూ వచ్చిన వ్యాక్సిన్ల సమర్థతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్.. తీసుకున్న కొందరికీ రక్తం గడ్డ కడుతున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యూకేలో ఇప్పటివరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30కి పైగా ఇలాంటి కేసులు రాగా.. ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సమర్థతపై, బ్లడ్ క్లాట్స్ గురించి యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఓ నివేదికను విడుదల చేసింది. ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. రక్తం గడ్డకట్టడానికి ఏదో లింకు ఉందని యురోపియన్ ఏజెన్సీ అధ్యయన బృందం చైర్మన్ మార్కో కవలరీ మంగళవారం పేర్కొన్నారు.
తమ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా టీకా – బ్లడ్ క్లాటింగ్‌కు సంబంధ ఉందన్న విషయం వాస్తవమేనని వెల్లడైందన్నారు. కానీ ఏ కారణం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందనేదీ స్పష్టంగా తెలియదని ఈఎంఏ అధికారి మార్కో కవలరీ తెలిపారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లడ్ ఎందుకు క్లాట్ అవుతుందో ఇంకా అధ్యయనం చేయాలన్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఎంత వయస్సున్న వ్యక్తులకు ఇవ్వాలి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
కాగా.. ఆస్ట్రాజెనెకా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటంతో ఇటలీతో పాటు యూరోప్‌లోని పలు దేశాలు ఈ వ్యాక్సిన్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కొన్ని దేశాలు మాత్రం ఆ టీకాను వినియోగిస్తున్నాయి. ఇదిలాఉంటే.. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై వస్తున్న ఆరోపణలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపడేసింది. టీకా సమర్థవంతంగా పనిచేస్తుందంటూ అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read: