ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ పై దాడి….చెంప దెబ్బ కొట్టిన ఆగంతకుని అరెస్ట్
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. మేక్రోన్ మంగళవారం సదర్న్ ఫ్రాన్స్ లోని డ్రోమ్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ తనకోసం వేచి ఉన్న వారిలో ఒక వ్యక్తి హఠాత్తుగా ఆయనను చెంప దెబ్బ కొట్టాడు...
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రోన్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. మేక్రోన్ మంగళవారం సదర్న్ ఫ్రాన్స్ లోని డ్రోమ్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ తనకోసం వేచి ఉన్న వారిలో ఒక వ్యక్తి హఠాత్తుగా ఆయనను చెంప దెబ్బ కొట్టాడు. వెంటనే అధ్యక్షుని భద్రతా సిబ్బంది అతడిని నెట్టివేసి అరెస్టు చేశారు. ఈ ఘటనతో షాక్ తిన్న మేక్రోన్ ని ఇతర అధికారులు దూరంగా తీసుకుపోయారు. కోవిద్ ఎపిడమిక్ అనంతరం మీ లైఫ్ ఎలా ఉందని విద్యార్థులను, రెస్టారెంట్ యజమానులను అడిగేందుకు వెళ్లిన మేక్రోన్ కి ఈ చేదు అనుభవం కలిగింది. మెటల్ బారియర్ వెనుక ఉన్నవారిలో గోధుమరంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తి..ఆయనపైచెంప దెబ్బ కొట్టి ‘డౌన్ విత్ మేక్రోనియా అని కేకలు పెట్టాడట.. అయితే మేక్రోన్ దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. అయితే ప్రధాని జీన్ కాస్టెక్స్ మాత్రం ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అటు ఈ ఘటనలో మరొకరిని కూడా అధ్యక్షుని భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు.
ఫ్రాన్స్ లో అధ్యక్షుని వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. ఈ పాలనలో అరాచకం వేళ్లూనుకుని ఉందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బహుశా ఆ పార్టీల మద్దతుదారుడే ఇందుకు పాల్పడి ఉంటాడా అని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.
??? | BREAKING: Macron slapped in the face
Via @ConflitsFrance pic.twitter.com/1L7eYTsvDR
— Politics For All (@PoliticsForAlI) June 8, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య లు ఎంతమంది?ఊరుకోక ఆనందయ్య అనుచరులమంటూ మందు తయారీ..Viral Video.
ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పంజా విసిరిన పెద్దపులి..రెండు ఎద్దుల పై దాడి చేసిన పులి..:Viral Video.
గత్యంతరం లేక ఈ నిర్ణయం..! స్వాగతమిస్తూనే చురకలంటించిన విపక్షాలు.కేంద్రం ఫ్రీ వాక్సిన్ పై స్పందన..