హృతిక్‌పై ప్రేమ ఎంత పని చేసిందంటే..!

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌ను ఇష్టపడుతోందని భార్యను చంపేశాడు ఓ భర్త. ఈ సంఘటన న్యూయార్క్‌లో జరిగింది. అక్కడి క్వీన్స్‌ హోమ్‌లో ఉండే దినేశ్వర్ బుదీదత్(33) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి భార్య డోన్ని దొజాయ్‌(27)ను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత దొజాయ్ సోదరికి మెసేజ్ చేసిన దినేశ్వర్, అందులో.. ‘‘డోన్నిని చంపేశాను. ఇంటి తాళాలు డోర్ దగ్గరున్న ఫ్లవర్ పాట్‌లో ఉన్నాయి’’ అని సందేశం పెట్టాడు. ఆ తరువాత అక్కడికి దగ్గర్లోని ఓ చెట్టుకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:26 am, Tue, 12 November 19
హృతిక్‌పై ప్రేమ ఎంత పని చేసిందంటే..!

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌ను ఇష్టపడుతోందని భార్యను చంపేశాడు ఓ భర్త. ఈ సంఘటన న్యూయార్క్‌లో జరిగింది. అక్కడి క్వీన్స్‌ హోమ్‌లో ఉండే దినేశ్వర్ బుదీదత్(33) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి భార్య డోన్ని దొజాయ్‌(27)ను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తరువాత దొజాయ్ సోదరికి మెసేజ్ చేసిన దినేశ్వర్, అందులో.. ‘‘డోన్నిని చంపేశాను. ఇంటి తాళాలు డోర్ దగ్గరున్న ఫ్లవర్ పాట్‌లో ఉన్నాయి’’ అని సందేశం పెట్టాడు. ఆ తరువాత అక్కడికి దగ్గర్లోని ఓ చెట్టుకు ఉరేసుకొని అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డోన్ని చాలాకాలంగా హృతిక్‌ను ఇష్టపడుతోందని… దాన్ని తట్టుకోలేకపోయిన అతడు ఆమె ప్రాణాలను తీశాడని దొజాయ్ సోదరి వెల్లడించింది.

కాగా ఈ జూలైలో వీరిద్దరు వివాహం చేసుకోగా.. కొద్ది రోజులకే దినేశ్వర్, దొజాయ్‌ను వేధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అవి ఎక్కువ కావడంతో అతడిపై కేసు కూడా నమోదు చేసింది. ఇక ఈ సంఘటనపై దొజోయ్ ఆంటీ మాట్లాడుతూ.. ఆమె చాలా మంచిదని.. బాగా కష్టపడేతత్వం ఉన్న అమ్మాయి కానీ అతడే ఓ పిరికిపంద. ఆమెను చంపే హక్కు అతడికి లేదు అని భావోద్వేగానికి గురైంది. కాగా హృతిక్‌కు పెద్ద అభిమాని అయిన డోన్ని.. అతడి ప్రతి సినిమాను వదలకుండా చూసేదని.. అలాగే టీవీలో హృతిక్ పాటలొస్తే ఆమె బాగా ఎంజాయ్ చేసేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇక దినేశ్వర్ గురించి డోర్నీ తమ దగ్గర అప్పుడప్పుడు చెప్పేదని.. డోర్నీ ఉద్యోగం చేయడం కూడా అతడికి నచ్చేది కాదని వారు చెప్పుకొచ్చారు.