Lockdown Terror: అక్కడ లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే అంతేసంగతులు.. హింసించి మరీ చంపేస్తారు!

మాస్కులు పెట్టుకోమంటే పెట్టుకోరు.. శానిటైజర్ రాసుకోమంటే ఎగాదిగా చూస్తారు.. గుంపులుగా ఉండకండి బాబులూ అంటే అదోలా మొహం పెట్టి చూస్తారు. ఇవన్నీ మనకు మామూలుగా కనపడే దృశ్యాలు. ప్రభుత్వాలు చెప్పినా.. పోలీసులు హెచ్చరించినా వినే  ప్రసక్తే లేదు.

Lockdown Terror: అక్కడ లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే అంతేసంగతులు.. హింసించి మరీ చంపేస్తారు!
Lockdown Terror
Follow us

|

Updated on: Apr 08, 2021 | 5:34 PM

Lockdown terror: మాస్కులు పెట్టుకోమంటే పెట్టుకోరు.. శానిటైజర్ రాసుకోమంటే ఎగాదిగా చూస్తారు.. గుంపులుగా ఉండకండి బాబులూ అంటే అదోలా మొహం పెట్టి చూస్తారు. ఇవన్నీ మనకు మామూలుగా కనపడే దృశ్యాలు. ప్రభుత్వాలు చెప్పినా.. పోలీసులు హెచ్చరించినా వినే  ప్రసక్తే లేదు. అందరూ అలా ఉండకపోయినా ఎక్కువ శాతం మంది మాత్రం ఇలానే నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ, మన ఆసియా దేశం ఫిలిప్పీన్స్ లో మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులు చేసే హంగామాతో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒక వ్యక్తి కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అతనికి గట్టి శిక్ష వేశారు. ఆగకుండా 100 పంపింగ్ ఎక్సర్సైజ్ చేయాలని ఆదేశించారు. తరువాత కూడా అతనిని మరో 200 సార్లు అలానే చేయమన్నారు. దానితో ఆ  యువకుడు ఇంటికి చేరిన తరువాత మరణించాడు.  ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

ఫిలిప్పీన్స్ లోని కెవైట్ ప్రావిన్స్ లోని జెనరల్ ట్రైయస్ సిటీలో ఉండే 28 ఎళ్ల డారెన్ మానాగ్ పెనరెండొండొ కుటుంబ సభ్యులు చెప్పినదాని ప్రకారం ఆ యువకుడు ఏప్రిల్ 1 వ తేదీన మంచినీళ్ల కోసం బయటకు వెళ్ళాడు. అయితే, అక్కడ కోవిడ్-19 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో పోలీసులు అతనిని ఆపి కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నా బయట తిరుగుతున్నందుకు 100 పంపింగ్ ఎక్సర్సైజ్ లు చేయమని ఆదేశించారు. అలా మూడుసార్లు అంటే 300 సార్లు అతనితో ఎక్సర్సైజ్ చేయించారు. దీంతో ఆతని ఆరోగ్యం క్షీణించింది. అతనిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. అతను మరణించాడు. ఈ సంఘటనపై అక్కడి మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు.

ఫిలిప్పీన్స్ ఆసియాలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినా దేశం. అక్కడ 8,19,000 కరోనా కేసులు నమోదు అవ్వగా, 14,000 మంది చనిపోయారు. గత నెలలో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతుండటంతో 25 మిలియన్ల మంది ప్రజలను లాక్ డౌన్ పాటించాల్సిందిగా అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.  అక్కడి ప్రజలు ప్రభుత్వం మాటను పెడచెవిన పెడుతుండడంతో నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పైన చెప్పిన సంఘటనతో పాటు ప్రతిరోజూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరొక సంఘటనలో నిబంధనలు ఉల్లంఘించారు అనే కారణంతో ఐదుగురు యువకులను కుక్కలు ఉన్న బోనులో ఉంచి తాళం వేశారు.

ఇటువంటి అమానవీయ సంఘటనలపై హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ పోరాడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై జరిమానాలు విధించవచ్చు. కానీ, ఇంత క్రూరంగా వ్యవహరించడం తగదని ఆందోళన చేస్తోంది.

Also Read: Corona Second Wave: రెండో దశలో రెచ్చిపోతున్న కరోనా.. ఓవైపు వైరస్.. ఇంకోవైపు వ్యాక్సిన్ కొరత

మొదటి దానికి భిన్నంగా కరోనా సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు.. అధికంగా వైరల్ లోడ్.. మాస్కులు ధరించక పోతే ముప్పే…