AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి దానికి భిన్నంగా కరోనా సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు.. అధికంగా వైరల్ లోడ్.. మాస్కులు ధరించక పోతే ముప్పే…

Coronavirus Second Wave: కరోనా వైరస్ రోజుకో రకంగా మారడమే కాదు.. తన లక్షణాలను కూడా మార్చుకుంటుంది.  జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట,..

మొదటి దానికి భిన్నంగా కరోనా సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు.. అధికంగా వైరల్ లోడ్.. మాస్కులు ధరించక పోతే ముప్పే...
Coronavirus Second Wave
Surya Kala
| Edited By: Team Veegam|

Updated on: Apr 08, 2021 | 6:44 PM

Share

Coronavirus Second Wave: కరోనా వైరస్ రోజుకో రకంగా మారడమే కాదు.. తన లక్షణాలను కూడా మార్చుకుంటుంది.  జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం ఇవన్నీ కొవిడ్ లక్షణాలు అని చెప్పేవారు. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో సరికొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ కండ్‌ వేవ్‌లో కరోనా మరణాల రేటు తక్కువగానే ఉంది. అయితే కరోనా బాధితులు ఎక్కువగా ఆసుపత్రి పాలవుతున్నారు.

కరోనా లో సరికొత్త వేరియంట్ల గా బ్రిటన్, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగులోకి వచ్చాయి. వీటివలన ఇన్ఫెక్షన్‌ తీవ్రత బాగా పెరుగుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. శక్తివంతమైన ఈ వేరియంట్స్ సోకిన వారికి కొత్తవారిలో కొత్తలక్షణాలు కనిపిస్తున్నాయని.. శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తోందని అంటున్నారు.

తాజాగా ఈ వైరస్‌ సోకిన వారిలో పొత్తికడుపులో నొప్పి, వాంతులు, వికారం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటోందన్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించినవారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఉండడం లేదు.

కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తుంది. దీనిలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌, హృద్రోగాల వంటివి ఉన్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే వైద్యుల్లో కరోనా పై పూర్తి అవగాహనా రావడంతో వెంటనే తగిన చికిత్సనందిస్తున్నారు. మన దేశంలో మళ్ళీ కరోనా ఈ రేంజ్ లో విజృంభించడానికి కారణం గతేడాది చివరి నుంచి చాలామంది మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మానేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని తప్పని సరిగా మాస్కులు ధరించాలని లేకపోతె ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Also Read: మానసిక ఒత్తిడిని తగ్గించి.. మహిళల నెలసరిలో ఇబ్బందులను తొలగించే ఆసనం ట్రై చేయండి..

జపాన్ లో ముందే వచ్చిన వసంత కాలం.. విరబూసిన చెర్రీ పూలు .. 1200 ఏళ్లలో..

హైదరాబాద్‌ బేగం బజార్ పై కరోనా సెకండ్‌ వేవ్ పంజా, మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం!